కాంగ్రెస్ మద్ధతుదారులపై స్టీఫెన్ రవీంద్ర నిఘా.. డీజీపీని కూడా తొలగించాలి : రేవంత్ రెడ్డి

By Siva Kodati  |  First Published Oct 12, 2023, 9:10 PM IST

కాంగ్రెస్‌కు అనుకూలంగా వున్న వారిపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నిఘా పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని డిసెంబర్‌ 9న తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఖాయమన్నారు . 


డిసెంబర్‌ 9న తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఖాయమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గురువారం తాండూరు  మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ సునీత సంపత్, మాజీ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి తదితరులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. డీజీపీని తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా వున్న వారిపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నిఘా పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని.. 45 రోజులు కష్టపడితే అధికారం మనదేనని ఆయన అన్నారు. 

అంతకుముందు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అమెరికా వెళ్లిన కొడుకు గుర్తుకొచ్చి ప్రాణం తల్లడిల్లుతోందా? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో  ఎంతో మంది విద్యార్థులు తమ కుటుంబాలకు దూరమై.. నానా అవస్థలు పడుతున్నారని, ఆ బిడ్డల తల్లిదండ్రుల కోస కేసీఆర్ సర్కారుకు ఖచ్చితంగా తగులుతుందని విమర్శించారు. కేటీఆర్.. దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా ?.. కొడుకుతో  కొద్ది రోజల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Latest Videos

undefined

ALso REad: మీ ప్రభుత్వానికి వారి శాపం తగులుతుంది.. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఇంటి మొఖం చూడని, లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా అని ఆగ్రహం వ్యక్తం  చేశారు. సర్కారు హాస్టళ్లలో పెట్టే తిండి తినలేక ఏడుస్తున్నారని తెలిసి అమ్మా నాన్నలు పడే ఆవేదన నీలా కాదనుకున్నావా ? అని నిలదీశారు.  

కొడుకు తిరిగిరాక, పదేళ్లుగా ఏ సాయానికి నోచుకోక కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుడి కుటుంబ యాతన నీలా కాదనుకున్నావా? మీ గ్లోబరీనా కంపెనీ ఉసురు తీసిన 30 మంది ఇంటర్ విద్యార్థుల కన్నపేగుల ఆక్రందన.. నీలా కాదనుకున్నావా? అని కేటీఆర్ పై రేవంత్ రెడ్డి విరుచుకపడ్డారు. తిండిపెట్టక చిన్నారులని ఏడిపించి, ఫీజు బకాయిలివ్వక యువతని గోసపెట్టి, ఉద్యోగాలివ్వక నిరుద్యోగులని వంచించిన మీ సర్కారుకు తల్లిదండ్రుల శాపం తగిలి తీరుతుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

click me!