హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత ఈటల రాజేందర్ బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరనున్నట్లు మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క స్పందించారు.
హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నిక ముగిసిన తర్వాత బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరనున్నాడంటూ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిజెపి అభ్యర్థి ఈటలతో కుమ్మక్కయ్యారని... అందువల్లే హుజురాబాద్ లో బలమైన నాయకున్ని కాంగ్రెస్ పోటీలో నిలపలేదన్న కేటీఆర్ ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు తాజాగా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కౌంటరిచ్చారు.
minister KTR గాలి మాటలు మాట్లాడుతున్నారని... ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే బావుంటుందని Batti Vikramarka హెచ్చరించారు. Revanth Reddy, Eatala Rajender కలిసిపోయారని... BJP, Congress కలిసి హుజురాబాద్ లో పోటీ చేస్తున్నాయని తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం ఊహాగానమేనని... అలాంటి చర్చలేవీ జరగలేదని భట్టి క్లారిటీ ఇచ్చారు.
undefined
సిద్దాంతపరంగా భిన్న దృవాలైన కాంగ్రెస్, బిజెపి లు హుజురాబాద్ లో కలిసి పనిచేస్తున్నాయన్న టీఆర్ఎస్ ప్రచారాన్ని ఖండిస్తున్నామని అన్నారు. TRS, బిజెపి కలిసే హుజురాబాద్ లో దళితబంధు ను నిలిపివేయించాయని భట్టి విక్రమార్క ఆరోపించారు.
read more కాంగ్రెస్‌లోకి 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: షబ్బీర్ అలీ సంచలనం
ఇదిలావుంటే మరో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ టీఆర్ఎస్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ Shabbir Ali సంచలన వ్యాఖ్యలు చేసారు. హుజురాబాద్ ప్రజలు అధికార టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా వున్నారని... ఈ ఎన్నిక తర్వాత రాజకీయ సమీకరణలు మారనున్నాయన్నారు. ఇకపై టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలుంటాయని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సాగుతున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారని... అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై టీఆర్ఎస్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిప ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరారని... టీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నా కూడ ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కూడ టీఆర్ఎస్ పార్టీ చేర్చుకుందన్నారు. ఇప్పుడు మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చిందని... టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు చాలామంది ఎమ్మెల్యేలు సిద్దంగా వున్నారని షబ్బీర్ అలీ తెలిపారు.