టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ఆస్తులు, అప్పులు ప్రకటించారు. ఈసారి కొడంగల్, కామారెడ్డిల నుంచి ఆయన బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్లా నామినేషన్ దాఖలు చేసిన ఆయన తనకు సంబంధించిన కీలక వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక రాజకీయ నాయకులంతా ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం మంచి రోజు కావడంతో ఎక్కువ మంది నామినేషన్లు సమర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా హేమాహేమీలు నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా నేతల ఆస్తులు, అప్పులు, కేసుల వంటి వాటిని తెలుసుకునేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు.
ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ఆస్తులు, అప్పులు ప్రకటించారు. ఈసారి కొడంగల్, కామారెడ్డిల నుంచి ఆయన బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్లా నామినేషన్ దాఖలు చేసిన ఆయన తనకు సంబంధించిన కీలక వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు.
undefined
ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్న దాని ప్రకారం రేవంత్ రెడ్డి వద్ద రూ.5,34,000 నగదు వుందట. అలాగే రేవంత్, ఆయన భార్య గీతా రెడ్డి పేర్ల మీద కలిపి వున్న స్థిర , చర ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ.30,95,52,652గా ఆయన ప్రకటించారు. అలాగే రేవంత్ రెడ్డిపై 89 పెండింగ్ కేసులున్నాయట. ఆయన వద్ద రూ.2 లక్షల విలువ చేసే పిస్టల్, రూ.50 వేల విలువ చేసే రైఫిల్ ఉన్నట్లుగా రేవంత్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
అలాగే రేవంత్ దంపతుల పేర్ల మీద రూ.1,30,19,901 మేర అప్పులు వున్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. అలాగే టీపీసీసీ చీఫ్ వద్ద ఒక హోండా సిటీ, మరో మెర్సిడిస్ బెంజ్ వున్నాయట. రేవంత్ రెడ్డి భార్య వద్ద రూ. 83,36,000 విలువైన 1,235 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలు.. రూ.7,17,800 విలువైన 9,700 గ్రాముల వెండి, వెండి వస్తువులు కూడా వున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.