తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మరో జాబితా విడుదల చేసిన బీజేపీ .. ఇంకా పెండింగ్‌లోనే పలు స్థానాలు

Siva Kodati |  
Published : Nov 09, 2023, 08:04 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మరో జాబితా విడుదల చేసిన బీజేపీ .. ఇంకా పెండింగ్‌లోనే పలు స్థానాలు

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆరుగురి పేర్లతో అభ్యర్ధుల జాబితాను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గురువారం ప్రకటించింది. ఇప్పటికే ఆ పార్టీ మూడు విడతల్లో మొత్తం 88 మంది అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆరుగురి పేర్లతో అభ్యర్ధుల జాబితాను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గురువారం ప్రకటించింది. ఇప్పటికే ఆ పార్టీ మూడు విడతల్లో మొత్తం 88 మంది అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా 8 స్థానాలకు జనసేనకు కేటాయించింది. మధిర, వికారాబాద్ , నర్సంపేట్, ఆలంపూర్, దేవరకద్ర స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి వుంది. రేపటితో నామినేషన్స్ దాఖలుకు గడువు ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయానికి అభ్యర్ధులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అభ్యర్ధులు వీరే :

సికింద్రాబాద్ కంటోన్మెంట్ - కృష్ణ ప్రసాద్
నాంపల్లి - రాహుల్ చంద్ర
శేరిలింగంపల్లి - రవికుమార్ యాదవ్
మేడ్చల్ - రామచంద్రరావు
పెద్దపల్లి - ప్రదీప్ కుమార్
సంగారెడ్డి - పులిమామిడి రాజు
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
మార‌నున్న హైద‌రాబాద్ ముఖ‌చిత్రం.. రూ. 4వేల కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు, క‌ళ్లు చెదిరే మార్పులు