111 జీవో ఎత్తివేతపై ఎన్జీటీని ఆశ్రయించనున్నట్టుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్:2019 జనవరి తర్వాత 111 జీవో పరిధిలో కొన్న భూముల వివరాలు బయటపెట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.బుధవారంనాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. జీవో 111 ఎత్తివేతపై ఎన్జీటీకి వెళ్తామన్నారు. 111జీవో ఎత్తివేత వెనుక ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు.కేసీఆర్ కుటుంబ సభ్యులు 111 జీవో పరిధిలో భూములు కొన్నాక ఈ జీవో ను ఎత్తేశారన్నారు.
ఏ పార్టీ నేతలు 111 జీవో పరిధిలో భూములు కొన్నా ఆ వివరాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 18న జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో 111 జీవో ను ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 111 జీవో ఎత్తివేతను విపక్షాలు తప్పుబడుతున్నాయి. ఈ జీవో ఎత్తివేత తో రైతుల కంటే రాజకీయ నేతలు బడా నేతలకు లాభం జరుగుతుందనే విమర్శలు కూడా లేకపోలేదు.
undefined
also read:ఔటర్ రింగ్ రోడ్డు లీజులో అక్రమాలపై ఈడీకి ఫిర్యాదు : రేవంత్ రెడ్డి
111 జీవో ఎత్తివేతతో ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరగనున్నాయి. 111 జీవో కారణంగా ఇప్పటివరకు ఈ ప్రాంతంలో భూముల క్రయ విక్రయాలపై రైతులు ఇబ్బంది పడ్డారు. 111 జీవో ఎత్తివేత్తతో ఇబ్బందులు తొలగిపోనున్నాయని ఈ ప్రాంత రైతులు అభిప్రాయంతో ఉన్నారు.