ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయంలో అవకతవకలు జరిగాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విసయమై ఈడీ , కాగ్ లకు సమాచారం ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు ను 30 ఏళ్ల పాటు లీజు దక్కించుకున్న ఐఆర్‌బీ సంస్థ ఎల్లుండిలోపుగా 10 శాతం నిధులను చెల్లించకపోతే ఆ కాంట్రాక్టును రద్దు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
బుధవారంనాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టును దక్కించుకున్న ఐఆర్‌బీ సంస్థ 10 శాతం నిధులను చెల్లించలేనని హెచ్‌ఎండిఏకు లేఖ రాసిందని సమాచారం ఉందన్నారు. ఎల్లుండి లోపుగా ఐఆర్‌బీ సంస్థ పది శాతం నిధులను ఐఆర్‌బీ సంసథ చెల్లించాలన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు లీజు కాంట్రాక్టును చూపి ఐఆర్‌బీ సంస్థ 49 శాతం వాటాను సింగపూర్ సంస్థకు విక్రయించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్ ను అప్పనంగా ప్రైవేట్ కంపెనీకి అప్పగించారన్నారు. దీని వెనుక కేటీఆర్ ఉన్నారని ఆయన ఆరోపించారు. ఐఆర్ బీ, సింగపూర్ సంస్థకు, షెల్ సంస్థకు ఉన్న లింకులేమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ సలహదారు సోమేష్ కుమార్, మున్పిపల్ శాఖ ప్రిన్నిసల్ సెక్రటరీ అరవింద్ కుమార్ లు ఈ తతంగం నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
also read:ఓఆర్ఆర్ లీజుపై సీబీఐ విచారణకు సిద్దం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఔటర్ రింగ్ రోడ్డు ను 30 ఏళ్ల పాటు లీజు విషయమై తాను అడిగిన సమాచారం ఇవ్వకపోతే హెచ్‌ఎండిఏను ముట్టడిస్తామన్నారు. ఓఆర్ఆర్ లీజు విషయంలో తన వద్ద ఉన్న సమాచారాన్ని ఈడీ , కాగ్ సంస్థలకు ఇస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయమై బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ఆయన అడిగారు. . ఔటర్ రింగ్ రోడ్డుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడి వదిలేశారన్నారు. ఓఆర్ఆర్ పై. బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.