పార్టీలో చర్చిస్తాం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ పై రేవంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Jul 27, 2022, 1:39 PM IST


మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే విషయమై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొంటుందని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం తాము సోనియాగాంధీని ఈడీ విచారణ అంశంతో పాటు పార్లమెంట్ సమావేశాలపై కేంద్రీకరించామన్నారు. 



న్యూఢిల్లీ: Munugode  MLA కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  BJP లో చేరే విషయమై  సాగుతున్న ప్రచారంపై  పార్టీలో అంతర్గతంగా చర్చించుకొంటామని టీపీసీసీ చీఫ్ Revanth Reddy  ప్రకటించారు.  ఇలాంటి విషయమై పార్టీ అధిష్టానం దృష్టి పెడుతుందని చెప్పారు. ఈ విషయమై పార్టీ అధినాయకత్వం నిర్ణయాలు తీసుకొంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం నాడు న్యూఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఇటీవలనే రాజగోపాల్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిశారు.అయితే అమిత్ షా ను కలిసిన మాట విషయం వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. అయితే  మూడు రోజుల క్రితం  పార్టీ మార్పు చారిత్రక అవసరమని కూడా రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు.

Latest Videos

undefined

పార్టీ మారే విషయమై రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో సమావేశాల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పలు మండలాల ముఖ్య నేతలతో  రాజగోపాల్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీలోనే రాజగోపాల్ రెడ్డి కొనసాగాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రెండు రోజుల క్రితం చర్చించారు. పార్టీ మారొద్దని కూడా సూచించారు. పార్టీలోనే కొనసాగుతారని  భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా తనను పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.   అయితే పార్టీలో రాజగోపాల్ రెడ్డికి సముచిత ప్రాధాన్యత ఇస్తామని కూడా భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ కాదని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఈ తరహా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయితే సోమవారం నాడు మాత్రం భట్టి విక్రమార్కతో పాటు , పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్  భేటీ అయ్యారు.

కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నేతలతో కూడా చర్చించారని సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ తో కూడా చర్చించారని సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని  బీజేపీ నేతలు చెబుతున్నారు. బండి సంజయ్ ఓ తెలుగు న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 

also read:అనుచరులతో చర్చలు: బీజేపీలో చేరేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొగ్గు

నల్గొండ, ఖమ్మం జిల్లాల నుండి కూడా పలువురు నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ నెల 29న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢీల్లీకి వెళ్లే అవకాశం ఉంది. బండి సంజయ్ పాదయాత్రలో  లేదా అమిత్ షా సభలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉన్నందున మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ భావిస్తుంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకత్వం  ఏర్పాట్లు చేసుకుంటుంది.

 
 

click me!