
కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయంటూ వస్తున్న వార్తలపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్‌తో పొత్తు కలలో కూడా జరగదన్నారు. కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర లంచ్ బ్రేక్‌లో రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ అయ్యారు. వరంగల్ సభలోనే టీఆర్ఎస్‌తో పొత్తు వుండదని రాహుల్ చెప్పారని రేవంత్ గుర్తుచేశారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనపై యుద్ధం చేస్తామన్న ఆయన... టీఆర్ఎస్ పాపాలను మోసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదన్నారు. కాంగ్రెస్‌ను పొలిటికల్ సీన్‌లో లేకుండా చేయడానికి బీజేపీని కేసీఆర్ ఎంకరేజ్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు అదే బీజేపీ కేసీఆర్ పాలిట శాపంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీలో గెలిచేంత మొనగాళ్లు ఎవరున్నారన్న ఆయన కనీసం 10 మంది కూడా గెలవలేరని జోస్యం చెప్పారు.
కాగా.. తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొత్త వ్యుహాన్ని అవలంభించే అవకాశం ఉంది. ముందుగానే పొత్తులు ఏర్పాటు చేసుకుని.. ఎన్నికల బరిలో నిలవాలని టీఆర్ఎస్ అధిష్టానంల ఆలోచిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పొత్తులతోనే ముందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. 2004 లో కాంగ్రెస్, వామపక్షాలతో, 2009లో టీడీపీ, వామపక్షాలతో.. టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే 2004లో కాంగ్రెస్, వామపక్షాలతో టీఆర్‌ఎస్ ఎన్నికల ముందు పొత్తు బాగానే పని చేయగా, 2009లో టీడీపీ, వామపక్షాలతో జతకట్టడంతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి ఉంది. అయితే 2014లో తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి టీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. అన్ని ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసింది.
ALso REad:ఎన్నికలకు ముందే పొత్తులకు సై అంటున్న టీఆర్ఎస్!.. ఆ నేతల్లో మొదలైన కలవరం..?
మునుగోడు ఉప ఎన్నికల్లో కలిసి పనిచేయడంపై వామపక్షాలతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీపీఐ.. టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నట్టుగా ప్రకటించింది. భవిష్యత్తులో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలిపింది. మునుగోడులో సీపీఎం కూడా గులాబీ పార్టీకే మద్దతిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆ చర్చల సమయంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు పొత్తుల అంశంపై కూడా టీఆర్‌ఎస్ నాయకత్వం, వామపక్ష పార్టీల నేతల మధ్య చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.