Munugode bypoll 2022: మన మునుగోడు మన కాంగ్రెస్ నినాదం,నియోజకవర్గంలో రేవంత్ మకాం

By narsimha lodeFirst Published Aug 16, 2022, 11:50 AM IST
Highlights

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో మన మునుగోడు మన కాంగ్రెస్ అనే నినాదంతో ఆ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇవాళ్టి నుండి మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తుంది. 
 

నల్గొండ:మునుగోడు అసెంబ్లీ స్థానినికి జరిగే ఉప ఎన్నికల్లో మన మునుగోడు మన కాంగ్రెస్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని  ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. 

మునుగోడు ఎమ్మెల్యే పదవికి ఈ నెల 8వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు.ఈ నెల 4వ తేదీన   కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు నియోజకవర్గంలో మకాం వేశారు. ఈ నియోజకవర్గంలో ఏడు మండలాలున్నాయి. ఈ ఏడు మండలాలకు ఇద్దరేసి కీలక నేతలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బాధ్యతలను అప్పగించింది. తమకు కేటాయించిన మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు  చేరుకున్నారు. ఇవాళ్టి నుండి ప్రతి రెండు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలను నిర్వహించనున్నారు. ఇశాళ మర్రిగూడ, నాంపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహంచనున్నారు. మరో వైపు ఈ నియోజకవర్గంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 15 రోజులు మకాం వేయనున్నారు. మునుగోడులో  తన పట్టును నిలుపుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుండి క్యాడర్  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపునకు వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తుంది. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపునకు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ కేంద్రీకరించింది. పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులపై టీఆర్ఎస్ కేంద్రీకరించింది. టీఆర్ఎస్ లో చేర్చుకొనే ప్రయత్నాలను తీవ్రం చేసింది. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చెదిరిపోవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 9 మాసాల పాటు ఓపిక పడితే  కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి భరోసాను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

also read:Munugode bypoll 2022 : టిఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి ఇంటివద్ద అర్థరాత్రి హై డ్రామా..

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ అభ్యర్ధులే ఎక్కువగా విజయం సాధించారు. ఒక్కసారి టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతు కూడా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు లెఫ్ట్ పార్టీల నేతలు తమకు మద్దతివ్వాలని కోరారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయమై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని సీపీఐ ప్రకటించింది. మరో వైపు ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించే సత్తా ఉన్న పార్టీలకే మద్దతిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మరో వైపు టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ను కూడా తమకు మద్దతివ్వాలని కాంగ్రెస్ నేతలు కోరారు.  ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు కోదండరామ్ తో కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు.మునుగోడు ఉప ఎన్నికల్లో  మద్దతివ్వాలని కోదండరామ్ ను కోరనున్నారు.
 

click me!