కమీషన్ల కోసమే ఆ ఒప్పందాలు, కాలం చెల్లిన నిర్మాణాలు.. 9 ఏళ్ల పాలనలో ఏం ఒరిగిందని : కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 25, 2023, 5:45 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. తొమ్మిదేళ్ల పాలన, అప్పుల భారం, ఆర్ధిక సంక్షోభం తప్పించి తెలంగాణకు ఒరిగింది ఏం లేదన్నారు. కమీషన్ల కోసమే లోపభూయిష్టమైన ఒప్పందాలు, కాలం చెల్లిన నిర్మాణాలు చేపడుతున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. విద్యుత్ విషయంలో ఏసీడీ పేరుతో వేస్తోన్న అదనపు భారాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన లేఖ రాశారు. అలాగే వ్యాపారాల నిర్వహణకు పోలీస్ లైసెన్స్ తప్పనిసరి నిబంధనను సైతం తక్షణం ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ లాంటి చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాలు వున్నాయని.. బీఆర్ఎస్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తున్న వామపక్షాలు పేదలపై పడుతున్న భారాన్ని అడ్డుకునేన ప్రయత్నం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. తొమ్మిదేళ్ల పాలన, అప్పుల భారం, ఆర్ధిక సంక్షోభం తప్పించి తెలంగాణకు ఒరిగింది ఏం లేదన్నారు. కమీషన్ల కక్కుర్తితో ప్రభుత్వ సంస్థలు దివాళా తీశాయని.. ఈ క్రమంలో విద్యుత్ ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన అదనపు భారం మోపుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

గతంలో అభివృద్ధి ఛార్జీలు, ఎడ్యుకేషన్ సెస్సులు, గ్రీన్ సెస్సుల పేరుతో భారం మోపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు కరోనా, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పేదలు అల్లాడిపోతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కరువై ఉద్యోగాలు పోయి యువత రోడ్డున పడుతున్నారని.. ఈ పరిస్ధితుల్లో విద్యుత్ డిపాజిట్ల పేరుతో ప్రభుత్వమే పేద, మధ్య తరగతి వాడపై దోపిడీకి తెగబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALso REad  : పాలమూరు గడ్డ పెదోళ్ల‌ అడ్డా.. ఇక్క‌డి 14 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటాం: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి

విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించమని గొప్పలు చెప్పుకుంటున్నారని.. అలాంటప్పుడు విద్యుత్ సంస్థలు 60 వేల కోట్ల నష్టాల్లోకి ఎందుకు వెళ్తాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు రూ.20 వేల కోట్లు బకాయి పడిన మాట వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం లోపాభూయిష్టమని.. దీని వల్ల రాష్ట్ర ప్రజలపూ భారం పడుతోందని రేవంత్ పేర్కొన్నారు. పవర్ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో కాలం చెల్లిన సాంకేతికత వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కమీషన్ల కోసమే లోపభూయిష్టమైన ఒప్పందాలు, కాలం చెల్లిన నిర్మాణాలు చేపడుతున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. 

click me!