ఫైర్ సేఫ్టీపై చట్టానికి సవరణలు: అధికారులకు కేటీఆర్ ఆదేశం

By narsimha lode  |  First Published Jan 25, 2023, 5:23 PM IST

షైర్ సేఫ్టీపై   అధికారులతో  మంత్రి కేటీఆర్  ఇవాళ  సమీక్ష నిర్వహించారు.  డెక్కన్ మాల్ లో  అగ్ని ప్రమాదం నేపథ్యంలో  మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షించారు. 
 


హైదరాబాద్:  ఫైర్ సేఫ్టీ చట్టానికి సవరణలు  చేయాలని  అధికారులను  తెలంగాణ  మంత్రి కేటీఆర్ ఆదేశించారు.బుధవారం నాడు  బూర్గుల రామకృష్ణరావు  భవనంలో  మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఫైర్ సేఫ్టీ పై  ఉన్నతాధి కారులతో  కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఫైర్ సేఫ్టీ  శాఖకు  అవసమైతే  నిధుల కేటాయిస్తామని  ప్రకటించారు. .ఈ బడ్జెట్ లోనే  నిధులు మంజూరు చేస్తామన్నారు.

రాష్ట్రంలోని పలు  పట్టణాల్లో ఫైర్  సేఫ్టీ బిల్డింగ్  ఓనర్లను  కూడా  భాగస్వాములను చేసేవిధంగా  చర్యలు తీసుకోవాలని  మంత్రి కేటీఆర్  కోరారు. డెక్కన్  మాల్ లో  గల్లంతైన  3 కుటుంబాలకు 5 లక్షల  చొప్పున  రూపాయల నష్టపరిహారం అందించనున్నట్టుగా  మంత్రి కేటీఆర్ చెప్పారు.డెక్కన్  మాల్ లో ఈ నెల  19వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది.ఈ అగ్ని ప్రమాదంలో భవనం పూర్తిగా దెబ్బతింది.  ఈ భవనాన్ని కూల్చివేయనున్నారు. రేపటి నుండి భవనం కూల్చివేత పనులు ప్రారంభం కానున్నాయి.  

Latest Videos

also read:రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేత : హైదరాబాద్ సంస్థ చేతికి టెండర్.. రేపటి నుంచి పనులు

సికింద్రాబాద్ లో ఇటీవల కాలంలో అనేక అగ్ని ప్రమాదాలు చోటు  చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డారు.  జనావాసాల మధ్యే గోడౌన్లు నిర్మించారు. బహుళ అంతస్థుల నిర్మాణాల్లో సరైన  సదుపాయాలు లేని కారణంగా   ప్రమాదాలు జరుగుతున్నాయి.  ప్రమాదాలు  జరిగిన భవనాల్లో  మెరుగైన వసతులు కూడా లేకపోవడం  ప్రమాదాలు పెద్ద ఎత్తున  జరగడానికి కారణమనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.హైద్రాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో  ఎక్కువగా  రెగ్యులరైజ్ చేసిన   భవనాల్లో జరిగాయని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు.  

బహుళ అంతస్థుల భవనాలు, మాల్స్, కమర్షియల్ భవనాలు, గోడౌన్లలను తరచుగా అధికారులు సర్వేలు నిర్వహించాలని  కూడా కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి సూచించారు. జనావాసాాల మధ్య  ఉన్న  గోడౌన్లు, స్టోర్స్ , ఇతర  కమర్షియల్స్ పై సర్వే  చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  అభిప్రాయపడ్డారు.

 


 

click me!