2013లో హామీ.. తెలంగాణ అమర జవాన్ కుటుంబానికి సాయమేది : కేసీఆర్‌కు రేవంత్ లేఖ

By Siva KodatiFirst Published Sep 1, 2022, 3:18 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటనపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొండారెడ్డి పల్లెలో దళిత జవాన్ యాదయ్య 2013లో చనిపోతే పట్టించుకోలేదని, ఆయన భార్యకు ఉద్యోగం ఇస్తానని చెప్పి.. ఇప్పటి వరకు తేల్చలేదని రేవంత్ ఆరోపించారు. 
 

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం లేఖ రాశారు. బీహార్‌ వరకు వెళ్లి అమర జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించిన కేసీఆర్ .. కొండారెడ్డి పల్లెలో దళిత జవాన్ యాదయ్య 2013లో చనిపోతే పట్టించుకోలేదని విమర్శించారు. ఆయన భార్యకు ఉద్యోగం ఇస్తానని చెప్పి.. ఇప్పటి వరకు పట్టించుకోలేదని రేవంత్ ఆరోపించారు. దేశ రాజకీయాల్లో ఏలాలన్న తపన తప్పితే.. తెలంగాణ జవాన్ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఆతృత కేసీఆర్‌కు లేదన్నారు రేవంత్ రెడ్డి. 

అంతకుముందు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై బుధవారం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇబ్రహీంపట్నంలో ఒక గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారని అన్నారు. వాళ్లంతా నిరుపేదలేనని.. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని రేవంత్ ఆరోపించారు. అల్లుడు హరీశ్ సమర్ధుడని కేసీఆర్ ఆరోగ్య మంత్రిని చేశారని.. కానీ ఆయన హయాంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ బీహార్ పర్యటన చేయడం కాదని.. ఇక్కడ చనిపోతున్న వారిని పట్టించుకోవాలని టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి చేశారు. 

ALso REad:ఇబ్రహీంపట్నం వెళ్లే తీరిక లేదు కానీ.. ఫ్లైట్‌లో బీహార్ వెళ్లి రాజకీయాలా : కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఆగ్రహం

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాల ముఖ్యమా అంటూ కోమటిరెడ్డి ఫైరయ్యారు. ఇబ్రహీంపట్నంలో నలుగురు మహిళలు మరణిస్తే.. మీకు వారిని పరామర్శించే తీరిక లేదా అంటూ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ విమానంలో బీహార్‌కు వెళ్లి రాజకీయాలు మాట్లాడే సమయం వుందా అంటూ కేసీఆర్‌పై ఆయన ఫైరయ్యారు. 

click me!