కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకొని కేసీఆర్ తన పార్టీ బలాన్ని పెంచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారంనాడు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలను కొనుగోలు చేశఆరని ఆయన ఆరోపించారు. 2018 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించినా కూడా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆయన చెప్పారు 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన అంశంపై ఫిర్యాదు చేసినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజలు నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే మంత్రి పదవులు, కార్పోరేషన్ పదవులతో పాటు ఇతరత్రా ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ లో చేరారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కేసీఆర్ కు పాలనపై దృష్టి లేదన్నారు. ప్రతిపక్షాలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు. ఫిరాయింపులతో తన పార్టీ బలాన్ని కేసీఆర్ పెంచుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ల వరకు అందరినీ కేసీఆర్ ప్రలోభపెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
also read:బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు: మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్
ఈ విషయమై తమ పార్టీ పలు దఫాలు స్పీకర్ కు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదన్నారు. అంతేకాదు సబితా ఇంద్రారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారన్నారు. రేగా కాంతారావును విప్ గా నియమించారన్నారు. తమ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోకుండా పదవులు కట్టబెట్టారని ఆయన చెప్పారు.,2014-18 మధ్యకాలం లో టీడీపీ నుండి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చారన్నారు.జ సీఎల్పీ నేతగా దళిత నాయకుడుంటే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. పరిపాలనపై దృష్టిపెట్టాలని భట్టి విక్రమార్క అసెంబ్లీ లో చెప్పినా కూడా కేసీఆర్ తన బుద్ది మార్చుకోలేదన్నారు.