మాస్టర్ ప్లాన్: కామారెడ్డిలో షబ్బీర్ అలీ ఆందోళన, అదుపులోకి తీసుకున్న పోలీసులు

By narsimha lode  |  First Published Jan 6, 2023, 1:03 PM IST

కామారెడ్డిలో  మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  రైతులతో  ధర్నాకు దిగిన  మాజీ మంత్రి షబ్బీర్ అలీని  పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. 


కామారెడ్డి: మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  రైతులతో కలిసి కామారెడ్డిలో ఆందోళన నిర్వహించిన  మాజీ మంత్రి షబ్బీర్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  షబ్బీర్ అలీని తరలించే వాహనానికి  ముందు  కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి అడ్డుకున్నారు. షబ్బీర్ అలీ వాహనం  ముందు బైఠాయించిన  కాంగ్రెస్ కార్యకర్తలను  పోలీసులు  వ్యాన్ లో తరలించారు.  పోలీస్ వాహనంలో  షబ్బీర్ అలీని  పోలీస్ స్టేషన్ కు తరలించారు. .   కొత్త మాస్టర్ ప్లాన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాని  రైతు  జేఏసీ  ఇవాళ కామారెడ్డి బంద్ కు  పిలుపునిచ్చింది.ఈ బంద్ కు  కాగ్రెస్ ,బీజేపీలు  మద్దతు  ప్రకటించాయి.  ఇవాళ ఉదయం నుండి  రైతు  జేఏసీ నేతలు, కాంగ్రెస్, బీజేపీ సహా  పలువురిని  పోలీసులు ముందస్తుగా  అరెస్ట్  చేశారు. 

హైద్రాబాద్ నుండి కామారెడ్డికి వచ్చిన  మాజీ మంత్రి షబ్బీర్ అలీ  ఇవాళ కామారెడ్డిలో  రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.  మాజీ మంత్రి షబ్బీర్ అలీని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై  వచ్చిన  రైతులు  ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  ఆందోళనలు చేస్తున్న రైతులు, పార్టీల నేతలను  పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.  

Latest Videos

also read:మాస్టర్ ప్లాన్: నేడు కామారెడ్డి బంద్, నేతల హౌస్ అరెస్టులు

మాస్టర్ ప్లాన్ ను వెంటనే  వెనక్కి తీసుకోవాలని   కాంగ్రెస్ నేత  షబ్బీర్ అలీ డిమాండ్  చేశారు.   మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  నిన్న కామారెడ్డి  కలెక్టరేట్  ముందు  ఆందోళనకు దిగారు రైతులు, ఈ ఆందోళనకు బీజేపీ,  కాంగ్రెస్ నేతలు  మద్దతు ప్రకటించారు. ఈ ధర్నా సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు  చేసుకున్నాయి. కలెక్టరేట్ లోనికి చొచ్చుకు వెళ్లేందుకు  రైతులు ప్రయత్నించారు.  పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.
 

click me!