హైదరాబాద్‌కి విముక్తి , ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ వల్లే .. మా పేటెంట్‌ని లాక్కోవాలనే : కేసీఆర్‌పై రేవంత్

By Siva KodatiFirst Published Sep 12, 2022, 5:04 PM IST
Highlights

హైదరాబాద్‌కు విముక్తి కల్పించింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికలో గెలిచేది కాంగ్రెస్సేనని... అక్టోబర్ 24న రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తుందని ఆయన చెప్పారు

సెప్టెంబర్ 17పై టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయన్నారు టీపీసీసీ రేవంత్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం ఇప్పించిన పార్టీ కాంగ్రెస్సేనని అన్నారు. మా పేటెంట్‌ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని.. తెలంగాణను కేసీఆర్ తెచ్చారని ప్రజల్లో భ్రమ కల్పిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నికలో గెలిచేది కాంగ్రెస్సేనని... అక్టోబర్ 24న రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తుందని ఆయన చెప్పారు. 15 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని.. పాదయాత్రలో భాగంగా 3 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్, శంషాబాద్, జోగిపేటలో బహిరంగ సభలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. 

అంతకుముందు కేసీఆర్, జేడీఎస్ నేత కుమారస్వామి భేటీ పైనా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పెట్టే కొత్త పార్టీలో కుమారస్వామి పార్టీని విలీనం చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను బలహీనపరచాలనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికలను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. కుట్రలో భాగంగానే కేసీఆర్ జాతీయ స్థాయిలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు. 

ALso REad:కేసీఆర్ పెట్టే కొత్త పార్టీలో కుమారస్వామి పార్టీని విలీనం చేస్తారా?: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్నవారినే కేసీఆర్ కలుస్తున్నాడని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బీఏస్పీ అధినేత్రి మాయవతి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేలను కేసీఆర్ ఎందుకు కలవరని నిలదీశారు. కాంగ్రెస్‌తో కలిసి ఉన్న పార్టీల నేతలనే కేసీఆర్ కలవడం వెనక అంతర్యమేమిటని ప్రశ్నించారు. 
 

click me!