కృష్ణా జలాల కంటే పెద్ద పనులున్నాయా.. కేఆర్ఎంబీ సమావేశం రద్దు ఎందుకు: కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు

By Siva KodatiFirst Published Jul 4, 2021, 6:35 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ వివాదం నేపథ్యంలో స్పందించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా తెలంగాణకు కృష్ణా జలాల్లో 34 శాతం (299 టీఎంసీలు) నీళ్లు చాలని మంత్రి హరీశ్‌రావు సంతకం పెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

ఏడేళ్ల పాటు 299 టీఎంసీల నీటినే వాడుకున్నామని ఆయన గుర్తుచేశారు. రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ 203 జీవో ఇచ్చినప్పుడు, రూ.7వేల కోట్లు కేటాయించినప్పుడు కేసీఆర్‌ స్పందించలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతలపై పాలమూరు రైతు గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీకి వెళ్లి స్టే తెచ్చారని గుర్తుచేశారు. సామాన్య రైతు ఎన్జీటీకి వెళ్లి స్టే తెచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Also Read:కృష్ణా జల వివాదం.. ప్రశ్నించినందుకే పీజేఆర్‌‌ను, వైఎస్ కేబినెట్‌లోకి తీసుకోలేదు: రేవంత్ రెడ్డి

మోడీ సర్కారును అన్ని విషయాల్లో సమర్థించిన కేసీఆర్‌... నీటి విషయంలో కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని మండిపడ్డారు. నోట్ల రద్దు, రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, జీఎస్టీ, ఆర్టికల్‌ 370 రద్దు.. ఇలా అన్ని విషయాల్లో మోడీ ప్రభుత్వానికి కేసీఆర్‌ మద్దతిచ్చారని గుర్తు చేశారు. ఈనెల 9న కృష్ణా బోర్డు సమావేశం వాయిదా వేయాలని కేసీఆర్‌ ఎందుకు కోరుతున్నారని రేవంత్ రెడ్డి నిలదీశారు. కేఆర్‌ఎంబీ సమావేశంలో తెలంగాణ వాదన బలంగా వినిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కృష్ణా జలాల పరిరక్షణ కంటే సీఎం కేసీఆర్‌కు పెద్దపనులు ఏమున్నాయో చెప్పాలన్నారు. సీఎం వెళ్లలేని పక్షంలో సీనియర్‌ మంత్రిని సమావేశానికి పంపించాలని రేవంత్ రెడ్డి సూచించారు. 

click me!