నా పక్కన నిలబడటానికి నీకు నొప్పేంటీ : రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ విమర్శలు

Siva Kodati |  
Published : Aug 05, 2022, 08:18 PM ISTUpdated : Aug 05, 2022, 08:22 PM IST
నా పక్కన నిలబడటానికి నీకు నొప్పేంటీ : రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ విమర్శలు

సారాంశం

మునుగోడులో జరిగిన బహిరంగ సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి . అమిత్ షా పక్కన వున్నప్పుడు .. నాపక్కన నిలబడటానికి నీకేం నొప్పి వచ్చిందంటూ రాజగోపాల్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. 

అమిత్ షా పక్కన వున్నప్పుడు .. నాపక్కన నిలబడటానికి నీకేం నొప్పి వచ్చిందంటూ రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎస్ఎల్‌బీసీ కోసం 5 వేల కోట్ల నిధులు తీసుకొస్తావా అని రేవంత్ ప్రశ్నించారు. హుజురాబాద్ , దుబ్బాక ఉపఎన్నికల తర్వాత ఏమైనా మారిందా అని ఆయన నిలదీశారు. ఇవాళ కాంగ్రెస్‌ని మోసం చేసినవాడు.. రేపు మళ్లీ మోసం చేయడా అని రేవంత్ ప్రశ్నించారు. ఎన్నో పదవులు ఇచ్చిన కాంగ్రెస్‌నే రాజగోపాల్ రెడ్డి మోసం చేశాడని ఆయన ఆరోపించారు. నయవంచకుడు రాజగోపాల్ రెడ్డిని మునుగోడు గడ్డపై పాతిపెడతామని రేవంత్ ఎద్దేవా చేశారు. 

2018 తర్వాత నాలుగు ఉపఎన్నికలు జరిగితే రెండు బీజేపీ, రెండు టీఆర్ఎస్ గెలిచాయని.. దీని వల్ల సాధించింది ఏందని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పోరాటంలో కలిసి రాలేదు కానీ.. కాంట్రాక్టుల కోసం అమిత్ షాను కలిశాడంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక ఎమ్మెల్యే పదవి పోయినా కాంగ్రెస్‌కు పోయేదేమి లేదన్నారు. ఉప ఎన్నికల్లో ఓడినంత మాత్రాన.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఏదైనా ఊడిందా అని రేవంత్ ప్రశ్నించారు. 

ALso Read:దుర్మార్గుడు, కమీనేగాడు, కుత్తేగాడు, కాంట్రాక్టర్ : మునుగోడు గడ్డపై రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ నిప్పులు

ఎమ్మెల్యే కాకుంటే అమిత్ షా ఇంటి ముందు కుక్క కూడా దగ్గరకు రానివ్వదంటూ ఆయన సెటైర్లు వేశారు. ఉపఎన్నికలతో మునుగోడు అభివృద్ధి అవుతుందనుకుంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని రేవంత్ సవాల్ విసిరారు. తాను కాంగ్రెస్ తరపున పోరాడుతున్నాను కాబట్టే తనపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. తాను 30 రోజులు జైల్లో వుంటే అమిత్ షా 90 రోజులు జైల్లో వున్నాడని రేవంత్ గుర్తుచేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai Fire on Media: మీడియా పైరెచ్చిపోయిన రేణు దేశాయ్ | Asianet News Telugu
Renu Desai Strong Comments On Street Dogs: కుక్కల మరణాలపై రేణు దేశాయ్ ఉగ్రరూపం | Asianet News Telugu