టీఆర్ఎస్‌పై విశ్వాసం లేదు.. కాంగ్రెస్ కనుమరుగు, ఇక అందరి చూపు బీజేపీవైపే : ఈటల

By Siva KodatiFirst Published Aug 5, 2022, 6:14 PM IST
Highlights

రానున్న రోజుల్లో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని.. ఇకపై ఆ పార్టీ నుంచే బయటకు వచ్చే వారే కానీ కొత్తగా చేరే వారు వుండరని అన్నారు ఈటల

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు చెందిన నేతలు బీజేపీతో సంప్రదింపుల తర్వాతే పార్టీ మారుతున్నారని అన్నారు ఈటల రాజేందర్. ఇప్పుడు అందరి చూపు బీజేపీ వైపే వుందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని.. ఇకపై ఆ పార్టీ నుంచే బయటకు వచ్చే వారే కానీ కొత్తగా చేరే వారు వుండరని అన్నారు ఈటల. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుందని.. ఆ పార్టీ నుంచి చాలా మంది నేతలు బీజేపీలోకి వస్తుందన్నారు రాజేందర్. బీజేపీని సంప్రదించకుండా ఎవరూ రాజీనామా చేయరని ఆయన స్పష్టం చేశారు. రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వ్యాపారులు బీజేపీలో చేరనున్నారని రాజేందర్ పేర్కొన్నారు. 

అంతకుముందు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు ఈటల రాజేందర్. ఆయన నాలుగు పార్టీలు మారలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గెలవదనే నిరాశ, నిస్పృహలతో రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పెద్దల అహంకారం వల్లే ఆ పార్టీకి ఈ పరిస్థితి అని విమర్శించారు. ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కారణం కాంగ్రెస్సేనని అన్నారు. ముఖ్యమంత్రులను లెక్క చేయని అహంకారం ఆ పార్టీది అని విమర్శించారు. ముఖ్యమంత్రలు ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు.

ALso REad:రేవంత్ బ్లాక్‌మెయిల్ చేసి ఎదిగాడు.. నాలుగు పార్టీలు మారలేదా?: ఈటల రాజేందర్

దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒక్క రాజస్థాన్ లోనే ఉన్నట్లుందని అన్నారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ఆయన ధర్మాన్ని నిర్వర్తించాడని చెప్పారు. బీజేపీ సిద్దాంతం ఉన్న పార్టీ అని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీకి మెజారిటీ వచ్చిందన్నారు. కానీ శివసేన అపవిత్ర పొత్తుకు శ్రీకారం చుట్టిందన్నారు.  సిద్ధాంతంలో బాల్ థాకరే అందె వేసినవారని చెప్పారు. ప్రజలు ఛీకొడుతుంటే ఉద్ధవ్ థాకరేకు ఏక్‌నాథ్ షిండే ఎదురు తిరిగారని అన్నారు. 

యూపీలో 403 స్థానాలు ఉంటే.. కాంగ్రెస్ ఎన్ని గెలిచిందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని తిరస్కరిస్తే కేరళకు వెళ్లాల్సి వచ్చిందని ఎద్దేవా చేవారు. తమిళనాడులో స్టాలిన్‌కు, జార్ఖండ్‌లో సోరెన్‌కు టీఆర్ఎస్ డబ్బులు పంపిందని ఆరోపించారు. అలాంటప్పుడు టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలోనే రాజగోపాల్ రెడ్డిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించామని చెప్పారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పినా ఆయన టీఆర్ఎస్‌లోకి రాలేదన్నారు. ఆర్థికంగా దెబ్బతీసినా కాంగ్రెస్‌లోనే ఉన్నారని చెప్పారు. 
 

click me!