అక్రమాలు బయటకొస్తాయనే భయం.. అందుకే మళ్లీ తెరపైకి ‘‘నేషనల్ హెరాల్డ్’’ కేసు: రేవంత్ రెడ్డి

Siva Kodati |  
Published : Jun 13, 2022, 03:34 PM IST
అక్రమాలు బయటకొస్తాయనే భయం.. అందుకే మళ్లీ తెరపైకి ‘‘నేషనల్ హెరాల్డ్’’ కేసు: రేవంత్ రెడ్డి

సారాంశం

నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.   

నేషనల్ హెరాల్డ్ కేసులో (national herald case) కాంగ్రెస్ (congress) అగ్రనేతలు సోనియా గాంధీ (sonia gandhi) , రాహుల్ గాంధీలకు (rahul gandhi) ఈడీ నోటీసులు (ed notice) ఇవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సైతం భగ్గుమన్నాయి. దీనిలో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy), ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంపై బీజేపీ (bjp) సర్కార్ అక్రమ కేసులు పెట్టిందన్నారు. 

దేశ స్వాతంత్ర్యం కోసం .. బ్రిటీషర్లను తరిమికొట్టేందుకు, స్వంతంత్రం సంపాదించాలనే భావజాలాన్ని వ్యాప్తిచేసేందుకు జవహర్‌లాల్ నెహ్రూ 1937లో ప్రజల తరపున నేషనల్ హెరాల్డ్ అనే పత్రికు ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. జవహర్‌లాల్ నెహ్రూ (jawaharlal nehru) , సర్ధార్ వల్లభభాయ్ పటేల్ (sardar vallabhbhai patel) వంటి ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు ఆనాడు ఆ పత్రికను ప్రారంభించారని  రేవంత్ అన్నారు. ఇందులో వచ్చే కథనాలతో స్పూర్తి పొంది దేశ ప్రజలు రోడ్డెక్కారని ఆయన గుర్తుచేశారు. దీంతో భయపడిన తెల్లదొరలు 1947లో నేషనల్ హెరాల్డ్‌ను నిషేధించారని రేవంత్ తెలిపారు. అయినా పోరాటం చేసి ప్రజల యొక్క అభిప్రాయాలను నిర్భయంగా కొట్లాడిన పత్రిక నేషనల్ హెరాల్డ్ అన్నారు . 

ALso Read:National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటీ? సోనియా, రాహుల్‌కు సంబంధం ఏమిటీ?

మోతిలాల్ నెహ్రూ (motilal nehru) , జవహర్‌లాల్ నెహ్రూలు వారి వందలాది ఆస్తులను కరిగించి దేశానికి స్వతంత్ర్యం తెచ్చారని రేవంత్ తెలిపారు. ఆ తర్వాత నేషనల్ హెరాల్డ్ మధ్యలో సరిగా నడవలేదన్నారు. నష్టాలు వచ్చి 90 కోట్ల అప్పుల్లో కూరుకుపోయి.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్ధితుల్లో వున్నప్పుడు రాహుల్ గాంధీ .. నెహ్రూ నాయకత్వాన్ని నిలబెట్టాలని భావించారని రేవంత్ అన్నారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా నేషనల్ హెరాల్డ్ పత్రికను మళ్లీ నడపాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని ఆయన గుర్తుచేశారు. 2002 నుంచి 2010 వరకు దాదాపు 90 కోట్ల అప్పుంటే.. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి, ఆ పత్రికను ప్రచురించడం జరిగిందని రేవంత్ అన్నారు. 

బీజేపీ వివిధ రాష్ట్రాల్లో చేస్తున్న కుట్రలను, మతం ముసుగులో జరుగుతోన్న విచ్ఛిన్న ప్రక్రియను ప్రజలకు చెప్పేందుకు నేషనల్ హెరాల్డ్ కథనాలను ప్రచురిందని ఆయన తెలిపారు. వాటికి బీజేపీ భయపడిపోయి.. ఈ పత్రిక మళ్లీ ప్రచురించి ఈ దేశంలో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తే 2014 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని గ్రహించి సుబ్రమణ్యస్వామితో ఫిర్యాదు చేయించారని రేవంత్ అన్నారు. అప్పుడు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వుండేదని.. కావాలనుకుంటే కేసును క్లోజ్ చేయొచ్చని ఆయన గుర్తుచేశారు. 

కానీ ఇందులో అణా పైసా కూడా చేతులు మారలేదని.. ఆ పత్రిక నష్టాల్లో వుందని, అందుకోసం కాంగ్రెస్ పార్టీయే 90 కోట్లు ఇచ్చిందని రేవంత్ అన్నారు. కానీ విచారణను నిష్పక్షపాతంగా జరిపేందుకు కాంగ్రెస్ వీలు కల్పించిందని ఆయన గుర్తుచేశారు. 2015లో ఈ కేసు విచారణ ముగిసిపోతే.. మళ్లీ 2024లో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం పతనం కాబోతోందని తెలిసి మళ్లీ నేషనల్ హెరాల్డ్ కేసును తెరిచారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోనియా గాంధీ కుటుంబంపై ఈగ వాలినా అంతుచూస్తామని ఆయన హెచ్చరించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!