కోకాపేట భూముల విక్రయం: సీబీఐకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు

By narsimha lodeFirst Published Sep 9, 2021, 2:37 PM IST
Highlights

హైద్రాబాద్ కోకాపేట భూముల విక్రయంలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీబీఐకి గురువారం నాడు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు సీబీఐకి ఆయన ఆధారాలను అందించారు. కేసీఆర్ సర్కార్ తనకు కావాల్సిన వారికి ఈ భూములను ధారాదత్తం చేసిందని ఆయన ఆరోపించారు.

న్యూఢిల్లీ: హైద్రాబాద్ కోకాపేట భూముల అమ్మకాలపై టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి సీబీఐకి గురువారం నాడు ఫిర్యాదు చేశారు.  తెలంగాణ ప్రభుత్వం తమకు అనుకూలమైన వారికి కోకాపేట భూములను కట్టబెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల  రాష్ట్ర ఖజానాపై రూ. 1500 కో్ట్ల భారం పడిందని ఆయన ఆరోపించారు.  ఈ భూముల అమ్మకంపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. 

కోకాపేట, ఖానామెట్ భూముల్లో గోల్ మాల్ జరిగిందని ఆయన ఆరోపించారు. గతంలో కోకాపేట్ భూముల విక్రయం జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ సర్కార్  తనకు సన్నిహితంగా ఉన్నవారికే ఈ భూములను కట్టబెట్టిందని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే.

రేవంత్ రెడ్డి ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండింది.ఈ విషయమై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తానని ప్రభుత్వం హెచ్చరించింది.రేవంత్ రెడ్డి  ఈ విషయమై గతంలో చెప్పినట్టుగా సీబీఐకి ఫిర్యాదు చేశారు. 

click me!