సెంటిమెంట్ తో ఓటేస్తే కడుపునిండదు...: హుజురాబాద్ ప్రజలతో మంత్రి హరీష్

Arun Kumar P   | Asianet News
Published : Sep 09, 2021, 02:16 PM IST
సెంటిమెంట్ తో ఓటేస్తే కడుపునిండదు...: హుజురాబాద్ ప్రజలతో మంత్రి హరీష్

సారాంశం

హుజురాబాద్ పట్టణంలో నిర్మించనున్న పెద్దమ్మ గుడి నిర్మాణానికి మంత్రులు హరీష్ రావు,గంగుల కమలాకర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. 

కరీంనగర్: సెంటిమెంట్ తో ఓట్లేస్తే కడుపు నిండది... పని చేసే వాళ్ళకు ఓట్లేసి ఆదరిస్తే అభివృద్ధి జరుగుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు హుజురాబాద్ ప్రజలకు సూచించారు. హుజూరాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్ద గల ఆంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి హరీష్ పెద్దమ్మగుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ... పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా వుందన్నారు. వచ్చే అరునెలల్లో గుడి పూర్తి చేసుకొని బోనాలు సమర్పించుకుందామన్నారు. ఇక్కడ ఇన్ని దేవాలయాలు ఉన్నా సరయిన రోడ్డు లేకపోవడం దారుణమని అన్నారు. చిలుక వాగు బ్రిడ్జి కోసం కోటి రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే 30 లక్షల రూపాయలతో దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. 

''టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. గతంలో ఇక్కడినుండి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి అయిన ఈటల రాజేందర్ కనీసం ఒక్క డబుల్ బెడ్రూం ఇంటిని కూడా కట్టలేదు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఅర్ నాలుగు వేల ఇండ్లు ఇచ్చినా ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టలేదు. అధికారంలో వుండగానే కనీసం ఒక్క ఇల్లు కట్టని ఈటలకు ఇప్పుడు ఓటు వేసి గెలిపించినా ఏం అభివృద్ది చేస్తాడు'' అని అన్నారు.

read more  చంద్రబాబు వద్దకు సీతక్కను పంపింది రేవంతే... కాంగ్రెస్ టిక్కెట్ల కోసమేనా?: జీవన్ రెడ్డి సంచలనం 

''హుజురాబాద్ నియోజవకర్గంలో స్థలం ఉన్న వారికి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. హుజురాబాద్ అన్ని రకాలుగా అభివృద్ది కావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించండి'' హరీష్ పిలుపునిచ్చారు. 

''నెలనెలకు గ్యాస్ ధర పెంచి సబ్సిడీ తగ్గిస్తోంది బిజెపి. నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల మీద భారం వేస్తుంది. ధరలు పెంచే బిజెపి కావాలో... పేద ప్రజలను అదుకునే టీఆర్ఎస్ కావాలో అలోచించండి. ఇంకా రెండేళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది'' అని హరీష్ అన్నారు. 

మరో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ... పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. గతంలో ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసిన వ్యక్తి ఇప్పటి వరకు పెద్దమ్మ తల్లికి పూజ కూడా చేయలేదన్నారు. కానీ చిలుక వాగుపై వంతెన నిర్మాణానికి కోటి రూపాయలతో పాటు రోడ్డుకు మరో రూ.40 లక్షలు మంజూరు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. ఇలా ఎప్పుడూ అభివృద్ది జరగాలంటే కేసీఅర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని గంగుల సూచించారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ