24 గంటల్లో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే తరిమి కొడతాం: టీఆర్ఎస్‌కి రేవంత్ వార్నింగ్

Published : Apr 12, 2022, 12:54 PM ISTUpdated : Apr 12, 2022, 01:07 PM IST
  24 గంటల్లో  వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే తరిమి కొడతాం: టీఆర్ఎస్‌కి రేవంత్ వార్నింగ్

సారాంశం

వరి ధాన్యం కొనుగోలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లో  ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  లేకపోతే మంత్రులు, టీఆర్ఎస్ నేతలను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకొంటామన్నారు. 

హైదరాబాద్: Paddy ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని TPCC చీఫ్ Revanth Reddy  డిమాండ్ చేశారు. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. మంగళవారం నాడు రేవంత్ రెడ్డి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ధాన్యం కొనుగోలు విషయమై Telangana ప్రభుత్వం ఇవాళ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. 24 గంటల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే గ్రామాలకు వచ్చే మంత్రులను, TRS నేతలను తరిమికొడతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్, BJPలు రైతులను  మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.  వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతుల పక్షాన తాము పోరాటం చేస్తామని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొంత కాలంగా మాటల యుద్దం సాగుతుంది.  తెలంగాణ ప్రభుత్వం గతంలో బాయిల్డ్ రైస్ ను ఇవ్వబోమని కేంద్రానికి లేఖ రాసి ఇచ్చిందని  బీజేపీ, కాంగ్రెస్ లు విమర్శిస్తున్నాయి. గతంలో కేంద్రానికి లేఖ రాసిచ్చి ఇవాళ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం సరైందేనా అని బీజేపీ ప్రశ్నిస్తోంది.,  వరి ధాన్యం కొనుగోలు విషయమై బీజేపీ,టీఆర్ఎస్ లు నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది.  ఈ రెండు పార్టీలు రైతులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

వరి ధాన్యం కొనుగోలు విషయమై కాంగ్రెస్ పార్టీ గత వారంలో ఆందోళనలు నిర్వహించింది. ఈ నెల 4 నుండి 11 వ తేదీ వరకు టీఆర్ఎస్ కూడా ఆందోళనలు నిర్వహించింది. కేంద్రానికి సీఎం కేసీఆర్ 24 గంటల డెడ్ లైన్ ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నంతో ఈ డెడ్ లైన్ పూర్తి కానుంది. ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్. వరి ధాన్యం కొనుగోలు  విషయమై కేసీఆర్  సర్కార్  కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్ఎస్ ఆందోళనకు కౌంటర్ గా హైద్రాబాద్ లో బీజేపీ ఆందోళనలు నిర్వహించారు.  హూజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతి నుండి రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వరి ధాన్యంపై మాటల యుద్దం సాగుతుంది. పంజాబ్ రాష్ట్రం తరహలోనే తెలంగాణ లో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు తెలంగాణ తరహలో పోరాటం చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. ఈ నిరసనల్లో భాగంగానే గత వారంలో వారం రోజుల పాటు నిరసనలకు దిగింది టీఆర్ఎస్. 

సోమవారం నాడు టీఆర్ఎస్ దీక్షల సందర్భంగా చేసిన విమర్శలపై కేంద్రం స్పందించింది. టీఆర్ఎస్ సర్కార్ చేసిన ఆరోపణలనుు కొట్టిపారేసింది.  రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ సెక్రటరీ వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్ చేస్తున్న విమర్శల్లో పస లేదని కూడా కేంద్రం కొట్టిపారేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్