పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై విపక్షాల నిరసన: సైకిల్‌పై పార్లమెంట్‌కి రేవంత్ రెడ్డి

Siva Kodati |  
Published : Aug 03, 2021, 03:04 PM IST
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై విపక్షాల నిరసన: సైకిల్‌పై పార్లమెంట్‌కి రేవంత్ రెడ్డి

సారాంశం

పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ విపక్ష ఎంపీలు మంగళవారం నాడు నిరసనకు దిగారు. కానిస్టిట్యూషన్ క్లబ్ నుండి పార్లమెంట్ వరకు విపక్ష ఎంపీలు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో  రాహుల్ గాంధీ సహా 14 పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు.

పెట్రోల్, డీజీల్ ధరల పెంపును నిరసిస్తూ విపక్షాలు నిర్వహించిన సైకిల్ యాత్రలో మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సైకిల్‌పై ‘‘అచ్చే దిన్’’ అన్న ఫ్లకార్డును పెట్టుకుని రేవంత్ యాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు కానిస్టిట్యూషన్ క్లబ్ నుండి పార్లమెంట్ వరకు కాంగ్రెస్ సహా 14 పార్టీల ఎంపీలు సైకిల్ పై యాత్ర నిర్వహించారు.పెగాసెస్ సహా ఇతర అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో మంగళవారం నాడు కానిస్టిట్యూషన్ క్లబ్ లో విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు.ఈ సమావేశానికి ఆప్, బీఎస్పీ ఎంపీలు గైర్హాజరయ్యారు.  విపక్షాల  బ్రేక్ ఫాస్ట్ భేటీ ముగిసిన తర్వాత ఎంపీలంతా సైకిల్ పై పార్లమెంట్ కు బయలుదేరారు.

Also Read:పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ సైకిల్‌పై: రాహుల్ సహా పార్లమెంట్‌కి బైసైకిల్‌పై విపక్షాలు

కేంద్రంపై విపక్షాలంతా మూకుమ్మడిగా పోరాటం  చేయాలని ఈ సమావేశంలో విపక్ష ఎంపీలు నిర్ణయం తీసుకొన్నాయి. దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు విపరితంగా పెరిగాయి. కేంద్రంతో పాటు , రాష్ట్రాలు పన్నులు వేయడంతో  పెట్రోల్ ధరలు  లీటరుకు వంద రూపాయాలు దాటాయి.పెగాసెస్ అంశాన్ని విపక్షాలు చాలా సీరియస్ గా తీసుకొన్నాయి. దేశంలోని విపక్ష పార్టీలకు చెందిన నేతలతో పాటు, జర్నలిస్టులు, కేంద్రమంత్రుల ఫోన్లను ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా హ్యాక్ చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఈ విషయమై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఇచ్చిన సమాధానంతో విపక్షాలు సంతృప్తి చెందడం లేదు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్