రేపు వాసాలమర్రికి కేసీఆర్: దత్తత గ్రామంలో పనుల పరిశీలన

By narsimha lodeFirst Published Aug 3, 2021, 2:49 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 4వ తేదీన వాసాలమర్రి గ్రామానికి  వెళ్లనున్నారు. వాసాలమర్రి టూర్‌లో యాదాద్రి ఆలయ పనులను కూడ సీఎం సమీక్షించనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 4న  వాసాలమర్రికి వెళ్లనున్నారు.  వాసాలమర్రితో పాటు యాదాద్రిలో ఆయన ఆలయ పనులను పర్యవేక్షిస్తారు.యాదాద్రి ఆలయ పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే ఆదేశించారు. రేపు  వాసాలమర్రి పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో  యాదాద్రి ఆలయ పనులను కూడ పర్యవేక్షించనున్నారు.

 వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకొన్నారు. గత మాసంలో ఆయన ఈ గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలపై కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్దిపై  చర్చించనున్నారు.గత సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలు ఏ మేరకు అమలయ్యాయనే విషయమై సీఎం కేసీఆర్ రేపు సమీక్షించనున్నారు.సీఎం కేసీఆర్ ఆగష్టు 4న వాసాలమర్రిలో పర్యటించనున్నందున  అదికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

వాసాలమర్రి అభివృద్ది పనుల పర్యవేక్షణకు గాను సీఎం కేసీఆర్ ప్రత్యేక అధికారిని నియమించారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి కమిటీలు ఇచ్చిన జాబితా ఆధారంగా  అనుమతులివ్వడంలో ప్రత్యేక అధికారి చొరవ చూపుతున్నారు.

click me!