రాత్రి అడవిలోకి తీసుకెళ్లి మహిళ ఎస్సైపై మరిపెడ ఎస్సై బలాత్కారం

Published : Aug 03, 2021, 02:43 PM ISTUpdated : Aug 03, 2021, 03:35 PM IST
రాత్రి అడవిలోకి తీసుకెళ్లి మహిళ ఎస్సైపై మరిపెడ ఎస్సై బలాత్కారం

సారాంశం

మహిళా ట్రైనీ ఎస్సై మీద అదే స్టేషన్ లో ఎస్ హెచ్ వోగా పనిచేస్తున్న అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మరిపెడ పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి జరిగింది. 

మహబూబాబాద్ జిల్లా : కీచక ఎస్సై చేతిలో మరో ట్రైనీ ఎస్సై  బలాత్కారనికి గురైంది. దీంతో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు న్యాయం కోసం వరంగల్ సీపీ కార్యాలయనికి చేరుకుని దీనిమీద ఫిర్యాదు చేశారు. 

మహిళా ట్రైనీ ఎస్సై మీద అదే స్టేషన్ లో ఎస్ హెచ్ వోగా పనిచేస్తున్న అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మరిపెడ పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి జరిగింది. 

సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ పేరుతో మహిళా ట్రెయిని ఎస్సై ని ఒంటరిగా వాహనంలో తీసుకెళ్లాడు ఎస్ హెచ్ వో శ్రీనివాస్ రెడ్డి. దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ అధికారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఆమె బయటపడింది. 

మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి వరంగల్ కమిషనర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేసింది. దళిత యువతి కావడమే తమ బిడ్డ చేసిన పాపమా అంటూ ఆ ట్రైనీ ఎస్సై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 జరిగిన ఘటన మీద తనకు న్యాయం జరగకుంటూ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని దళిత ఎస్సై ట్రైని చెబుతోంది. ఎస్ హెచ్ వో శ్రీనివాస్ రెడ్డి మరిపెడ లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నాడు. 

వరంగల్ సీపీ కార్యాలయంలోనే బాధితులు ఉన్నారు. కాగా ట్రెయినీ ఎస్సై ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాస రెడ్డిని అరెస్టు చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్