ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్‌దే.. మాపై విమర్శలా : బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి కౌంటర్

By Siva Kodati  |  First Published Nov 14, 2023, 7:54 PM IST

బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఉచిత విద్యుత్ దస్త్రంపై నాటి మంత్రి షబ్బీర్ అలీ తొలి సంతకం పెట్టారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్ అందించామని ఆయన తెలిపారు. 


బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కామారెడ్డిలో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ వస్తే విద్యుత్ ఉండదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ దస్త్రంపై నాటి మంత్రి షబ్బీర్ అలీ తొలి సంతకం పెట్టారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

కాంగ్రెస్ హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్ అందించామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే రైతులకు చెందిన రూ.1200 కోట్లు రద్దు చేశామని , రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేశామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు అప్పుల పాలయ్యారని రేవంత్ ఎద్దేవా చేశారు. 

Latest Videos

undefined

Also Read: రేవంత్ రెడ్డి ఓ గజదొంగ .. ఆయనపై ఎన్నో కేసులు, నా మీద ఒక్కటైనా వుందా : కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని అడుగుతున్నారని.. కేసీఆర్‌ను ఓడించేందుకే ఇక్కడికి వచ్చానని ఆయన తెలిపారు. కామారెడ్డి ప్రజల భూములు కాపాడే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడిందని.. కానీ యువత ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని ఆయన హామీ ఇచ్చారు. భూమి లేని పేదలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డిలో భూములను కాపాడే బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. 
 

click me!