ఖమ్మం బీఆర్ఎస్‌లో నామా వర్సెస్ పువ్వాడ?.. ఆత్మీయ సమ్మేళనానికి పిలుపు లేదన్న నామా నాగేశ్వరరావు..

Published : May 07, 2023, 05:20 PM IST
ఖమ్మం బీఆర్ఎస్‌లో నామా వర్సెస్ పువ్వాడ?.. ఆత్మీయ సమ్మేళనానికి పిలుపు లేదన్న నామా నాగేశ్వరరావు..

సారాంశం

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకుల మధ్య విభేదాలు  మరోసారి వెలుగుచూశాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుల మధ్య గ్యాప్ ఉందని మరోసారి స్పష్టమైంది. 

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకుల మధ్య విభేదాలు  మరోసారి వెలుగుచూశాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుల మధ్య గ్యాప్ ఉందని మరోసారి స్పష్టమైంది. ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తనకు ఆత్మీయ సమ్మేళనం గురించి ఇప్పటివరకు తెలియదని  అన్నారు. తనకు సమాచారం తెలిస్తే ముందే వచ్చేవాడినని అన్నారు. ఇటువైపుగా పని మీద వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని తెలిసిందని చెప్పారు. తనను ఆత్మీయ సమావేశానికి పిలవకపోయినా హాజరయ్యానని తెలిపారు. తన ఆత్మీయుల కోసం తనను ఆహ్వానించకపోయినా వచ్చానని చెప్పారు. అయితే ఆ సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ వేదికపైనే ఉన్నారు. 

మార్చి 19న ఖమ్మంలో నిర్వహించిన తొలి ఆత్మీయ సమావేశం నిర్వహించగా.. దానికి మంత్రి పువ్వాడ అజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఆ సమ్మేళనంలో కూడా నామా నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో తాను గల్లీ గల్లీ తిరిగినవాడినని.. కానీ సమావేశాలకు తనకు పిలవడం లేదని అన్నారు. పార్టీ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు తనని  పిలువడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. . తనను ఎక్కడికి పిలిచిన వస్తానని చెప్పారు. అభివృద్ధిలో తనని భాగస్వామిని చేయాలని అక్కడి వారితో అన్నారు. ఈ సమావేశంలో ఉన్న చాలా మంది తనతో పాటే పనిచేసినవారని.. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే పక్కన పెట్టాలని కూడా కోరారు. 

అయితే తాజాగా మరోసారి ఆత్మీయ సమ్మేళననానిక తనకు ఆహ్మానం లేదని ఎంపీ నామా  నాగేశ్వరరావు బహిరంగంగానే తెలిపారు. కానీ పార్టీ కోసమే తాను ఇక్కడికి వచ్చానని కూడా స్పష్టం చేశారు. దీంతో నామా కామెంట్స్ ఇప్పుడు జిల్లా బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ పరిణామాలపై బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!