ఎన్ఎస్‌యూఏ అధ్యక్షుడిని వెంటాడి అరెస్ట్ చేసిన పోలీసులు.. రేవంత్ ఆగ్రహం

By Siva KodatiFirst Published Jul 16, 2021, 2:45 PM IST
Highlights

ఎన్ఎస్‌యూఏ చీఫ్ వెంకట్ బాల్మూర్ అరెస్ట్ వీడియోపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు అరాచకంగా ఉందని విమర్శించారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసేందుకు తమకు అనుమతి ఉన్నప్పటికీ, వెంకట్ ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ రేవంత్ ప్రశ్నించారు.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ హైదరాబాదులో టీ. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఛలో రాజ్ భవన్ ను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ తెలంగాణ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు వెంకట్ బాల్మూర్ ను పోలీసులు రోడ్డుపై వెంబడించి మరీ వచ్చి అరెస్ట్ చేయడం విమర్శలకు తావిస్తోంది.

పోలీసులు తన చొక్కా పట్టి లాగుతున్నప్పటికీ వెంకట్ రాజ్ భవన్ దిశగా పరుగులు తీశారు. అయితే పెద్ద సంఖ్యలో చుట్టుముట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాము అనుమతి తీసుకున్నప్పటికీ పోలీసులు అరెస్ట్ చేశారంటూ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి గులాంగిరీ చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. మరోవైపు ఎన్ఎస్‌యూఏ చీఫ్ వెంకట్ బాల్మూర్ అరెస్ట్ వీడియోపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు అరాచకంగా ఉందని విమర్శించారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసేందుకు తమకు అనుమతి ఉన్నప్పటికీ, వెంకట్ ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ రేవంత్ ప్రశ్నించారు.

ALso Read:రేవంత్ రెడ్డి అరెస్ట్.. వచ్చేది సోనియా రాజ్యమేనన్న టీపీసీసీ చీఫ్, ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. తమకు మోడీ మీద, కేసీఆర్ మీద నమ్మకం లేదన్నారు. కేసీఆర్, మోడీ ప్రజలను దోచుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. హ్యాకర్లతో ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చేది సోనియా రాజ్యమని.. అది కాంగ్రెస్ కార్యకర్తల రాజ్యమని రేవంత్ స్పష్టం చేశారు. పోలీసులు తమను ఇబ్బంది పెట్టొద్దని.. మీరు ఇబ్బంది పడొద్దని ఆయన హితవు పలికారు. కనీసం గవర్నర్ అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వలేదని రేవంత్ మండిపడ్డారు.

click me!