తన పేరుతో వరి పైరు... యువ రైతుకు కేటీఆర్ కృతజ్ఞతలు

By Arun Kumar PFirst Published Jul 16, 2021, 2:33 PM IST
Highlights

వరి మడిలో తన పేరును వరినాటుతో లిఖించి అభిమానాన్ని చాటుకున్న యువ రైతుకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ మీద ఉన్న అభిమానాన్ని ఓ రైతు సరికొత్తగా చూపించాడు. తనకున్న పొలంలో వరి నాట్లు వేయడానికి వేసినటువంటి నారు మడిలో ఇంగ్లీషులో మంత్రి కేటీఆర్ అక్షరాల రూపంలో  నారు పోశాడు. ఈ ఫోటోను కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేయగా మంత్రి స్పందించారు. ''థ్యాంక్స్ అర్జున్... నీ అభిమానానికి దన్యవాదాలు'' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.  

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెధిరా గ్రామానికి చెందిన యువ రైతు శనిగారపు అర్జున్ కు మంత్రి కేటీఆర్ అంటే అమితమైన అభిమానం. తన అభిమానాన్ని వ్యక్తపర్చడానికి వ్యవసాయాన్నే ఉపయోగించుకున్నారు. తన పొలంలో కేటీఆర్ పేరును ఇంగ్లీష్ అక్షరాలతో నారు పోసి అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే ఆ రైతు అభిమానం ఇప్పుడు కేటీఆర్ వరకు చేరింది. 

Many thanks Arjun 🙏 so kind of you https://t.co/TjPXqaTM13

— KTR (@KTRTRS)

ఈ సందర్భంగా రైతు అర్జున్ మాట్లాడుతూ... టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాకు తానెంతో ఆకర్షితుడనయ్యానని అన్నారు. అంతేకాకుడా యువ మంత్రి కేటీఆర్ పనితీరు కూడా నచ్చడంతో అతడికి అభిమానిగా మారానని అన్నారు. ఇలా గత రెండు, మూడు సంవత్సరాల నుండి పొలంలో నారు మడిని కేటీఆర్ అక్షరాలతో పెంచుతున్నానని తెలిపాడు. దీనిపై తాజాగా కేటీఆర్ స్పందించడం ఎంతో ఆనందంగా వుందన్నారు.

వీడియో  కేటీఆర్ పై రైతు అభిమానం: పొలంలో వరినాట్లతో KTR పేరు
 

click me!