బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు:టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ

By narsimha lodeFirst Published Jul 16, 2021, 2:27 PM IST
Highlights

 టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావడంపై తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయమై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని భావిస్తోంది.

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రగతి భవన్ లో శుక్రవారం నాడు మధ్యాహ్నం ప్రారంభమైంది. ఉమ్మడి ప్రాజెక్టులను  కేఆర్ఎంబీ, గోదావరి బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం తీసుకొచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ను  తెలంగాణ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకుండా బోర్డు పరిధిలోకి  ప్రాజెక్టులను తీసుకురావడంపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

 

also read:రెచ్చగొట్టినా తొడలు కొట్టలేదు, మీసం తిప్పలేదు: బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులపై సజ్జల రియాక్షన్ ఇదీ...

ఈ విషయమై న్యాయ నిపుణులతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.కేంద్రం నిర్ణయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని  టీఆర్ఎస్ భావిస్తోంది.   ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్,  ఆర్డీఎస్ కుడికాలువలపై ూడ తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.ఈ విషయమై కూడ కేంద్రానికి ఫిర్యాదు చేసింది.కృష్ణా, గోదావరి నదీ జలాల్లో  రాష్ట్రానికి  న్యాయమైన వాటా కోల్పోకుండా పోరాటం చేయాలని కేసీఆర్ భావిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.
 

click me!