బీజేపీలో చేరిన తర్వాత ఈటలపై కేసులు ఏమయ్యాయి: మూడుచింతలపల్లిలో రేవంత్ రెడ్డి

Published : Aug 24, 2021, 05:21 PM ISTUpdated : Aug 24, 2021, 05:30 PM IST
బీజేపీలో చేరిన తర్వాత ఈటలపై కేసులు ఏమయ్యాయి: మూడుచింతలపల్లిలో రేవంత్ రెడ్డి

సారాంశం

హుజూరాబాద్ లో దళితులు తలుచుకొంటే  కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు అవకాశం ఉందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. మూడు చింతలపల్లిలో ఆయన 48 గంటల దళితగిరిజన దీక్షను ఆయన ప్రారంభించారు.   


 హైదరాబాద్: ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత ఆయనపై కేసులు ఏమయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.కేసీఆర్ దత్తత తీసుకొన్న మూడు చింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  దళిత గిరిజన దీక్షను  మంగళవారం నాడు ప్రారంభించారు. 48 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగిస్తారు.

also read:అడ్డంవస్తే తొక్కుకొంటూ గజ్వేల్‌కి వస్తా: మూడు చింతలపల్లిలో రేవంత్ రెడ్డి

దళితుల భూమి, దేవాలయభూములను ఆక్రమించుకొన్నాడని ఆఘమేఘాల మీద కేబినెట్ నుండి రాజేందర్ ను తొలగించారన్నారు. రాజేందర్  పై ఐఎఎస్ ల కమిటీ  నివేదికలు ఇంతవరకు ఎందుకు రిపోర్టులు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత  ఈ కేసులో దర్యాప్తు వేగం ఎలా ఉందో మీకందరికి తెలుసునని ఆయన చెప్పారు. దిొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకొన్నట్టుగానే  రాజేందర్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.  మోడీ వేరు కేసీఆర్ వేరు కాదని తాను మొదటి నుండి చెబుతున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

 హుజూరాబాద్‌లో దళిత బిడ్డలు అనుకొంటే కేసీఆర్ కు కేసీఆర్ పార్టీకి శాశ్వత గుణపాఠం చెప్పేందుకు అవకాశం ఉందన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ పదవి పోదన్నారు.  హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే మోడీ ప్రపంచానికి ప్రధాని కాలేడన్నారు.

 కేసీఆర్ కు గుణపాఠం చెప్పకపోతే దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో బతకలేరని రేవంత్ రెడ్డి చెప్పారు.హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 22 వేల దళిత కుటుంబాలున్నాయన్నారు. కేసీఆర్ ఇచ్చే దళిత బంధు పథకం కింద నిధులను దళిత బిడ్డలు తీసుకోవాలన్నారు. రాష్ట్రమంతా ఈ పథకం కింద  దళితులకు నిధులను ఇప్పించే బాధ్యతను హుజూరాబాద్ దళిత బిడ్డలు తీసుకోవాలని ఆయన కోరారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం