అడ్డంవస్తే తొక్కుకొంటూ గజ్వేల్‌కి వస్తా: మూడు చింతలపల్లిలో రేవంత్ రెడ్డి

Published : Aug 24, 2021, 05:00 PM ISTUpdated : Aug 24, 2021, 05:29 PM IST
అడ్డంవస్తే తొక్కుకొంటూ గజ్వేల్‌కి వస్తా: మూడు చింతలపల్లిలో రేవంత్ రెడ్డి

సారాంశం

వచ్చే నెలలో గజ్వేల్ కి వస్తానని  అడ్డం వచ్చినవారిని తొక్కుకొంటూ వస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. మూడు చింతలపల్లిలో ఆయన 48 గంటల దీక్షను ఆయన ప్రారంభించారు.

హైదరాబాద్: వచ్చే నెలలో గజ్వేల్ గడ్డ మీదికి వస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. అడ్డం వచ్చే టీఆర్ఎస్  శ్రేణులను తొక్కుకుంటూ వెళ్తానని ఆయన ప్రకటించారు. ఒకవేళ అలా చేయకపోతే  అక్కడే గుండు గీయించుకొంటానని ఆయన ప్రకటించారు.

also read:అలా అయితే రాజీనామా చేస్తా, చర్చకు సిద్దమా?: మూడు చింతలపల్లిలో దళిత గిరిజన దీక్షలో రేవంత్

కేసీఆర్ దత్తత తీసుకొన్న మూడు చింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  దళిత గిరిజన దీక్షను  మంగళవారం నాడు ప్రారంభించారు. 48 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగిస్తారు. తాను ఈ దత్తత గ్రామాల్లోకి రాకుండా ఉండాలని కొందరితో తనపై విమర్శలు చేయించాడని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ విమర్శలపై తాను ఇక్కడి నుండి మాట్లాడేందుకే  ఇంతకాలం మౌనంగా ఉన్నానని ఆయన చెప్పారు. 

తనపై విమర్శలు చేసిన గ్రామాలకు రాకుండా అడ్డుకోవాలని టీఆర్ఎస్ నేతలు పన్నాగం పన్నారన్నారు.  ఫామ్‌హౌస్‌ పక్కకు వచ్చి ఈ విమర్శలకు సమాధానం  చెప్పేందుకే తాను ఇంతకాలం నోరు తెరవలేదన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదన్నారు.  కేసీఆర్ దత్తత తీసుకొన్నా ఈ గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ జెండాకే అండగా నిలిచారని ఆయన గుర్తు చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే