నిరుద్యోగ జంగ్ సైరన్: కదలి రండి.. లాఠీ.. తూటాలకు నేనే ముందుంటా: రేవంత్ రెడ్డి

By telugu teamFirst Published Oct 2, 2021, 1:03 PM IST
Highlights

విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ చేపట్టనున్న జంగ్ సైరన్ నిరసన కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు దిల్‌సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు నిరసన ర్యాలీ ఉంటుందని, ప్రజలు పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే తానే ముందుంటారని అన్నారు. లాఠీ తగిలినా, తూటా తగిలినా తనకే ముందు తగులుతుందని తెలిపారు.
 

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో ఆందోళనకు శ్రీకారం చుడుతున్నది. రాష్ట్రంలో నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో ఇవాళ నిరసన ర్యాలీ చేపట్టనుంది. ఈ నిరసన ర్యాలీ శాంతియుతంగా సాగుతుందని, ప్రజలు కదలి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒకవేళ పోలీసులు అత్యుత్సాహం చూపించినా తానే ముందుంటురాని తెలిపారు. లాఠీ తగిలినా, తూటా తగిలినా తనకే ముందు తగులుతుందని అన్నారు. దిల్‌సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ర్యాలీ సాగనుందని వివరించారు.

గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు ఆయన గాంధీభవన్‌లో మహాత్ముడికి నివాళి అర్పించారు. అనంతరం ఈ నిరసన కార్యక్రమంపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. గాంధీ జయంతి వేళ తాము శాంతియుతంగా నిరసనలు చేపడుతున్నామని అన్నారు. నిరుద్యోగ జంగ్ సైరన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ దిల్‌సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు సాగుతుందని తెలిపారు. పోలీసులూ ఈ జంగ్ సైరన్ ర్యాలీ శాంతియుతంగా జరగడానికి సహకరించాలని కోరారు. అలా కాదని, వారు అత్యుత్సాహం ప్రదర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటారని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక వేళ ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే తాను ముందుంటారని చెప్పారు. లాఠీ తగిలినా, తూటా తగిలినా తనకే ముందు తగులుతుందని అన్నారు. ప్రశాంతంగా జరిగే కార్యక్రమాలను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ నిరసన కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి.

click me!