రాంగ్ రూట్ లో కేటీఆర్ కారు: అడ్డుకున్న ట్రాఫిక్ ఎఎస్సై, తోసేసి గులాబీ దండు

Published : Oct 02, 2021, 12:13 PM ISTUpdated : Oct 02, 2021, 12:26 PM IST
రాంగ్ రూట్ లో కేటీఆర్ కారు: అడ్డుకున్న ట్రాఫిక్ ఎఎస్సై, తోసేసి గులాబీ దండు

సారాంశం

తెలంగాణ మంత్రి కేటీఆర్ కారు రాంగ్ రూట్ తీసుకోవడంతో అవాంఛనీయమైన సంఘటన చోటు చేసుకుంది. రాంగ్ రూట్ తీసుకున్న కేటీఆర్ కారును అడ్డగించడానికి ట్రాఫిక్ ఎస్సై ప్రయత్నించాడు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కారు రాంగ్ రూట్ తీసుకుంది. దీంతో కేటీఆర్ కారును ఆపడానికి ట్రాఫిక్ ఎస్సై ప్రయత్నించాడు. దాన్ని సహించని టీఆర్ఎస్ కార్యకర్తలు ట్రాఫిక్ ఎస్సైని తోసేశారు. ఈ సంఘటన హైదరాబాదులోని బాపూఘాట్ సమీపంలో జరిగింది.

బండారు దత్తాత్రేయ కారు బయటకు వస్తుండడంతో కేటీఆర్ కారు రాంగ్ రూట్ తీసుకుంది ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపూజీకి నివాళులు అర్పించడానికి కేటీఆర్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు
IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ