
నల్గొండలో తలపెట్టిన కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన సభను రద్దు చేస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న నల్గొండ ఎంజీ యూనివర్సిటీలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తామని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే స్థానిక ఎంపీనైన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రేవంత్ ఈ సభను ఎలా ప్రకటిస్తారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలకబూనారు. ఆయన అభ్యంతరంతో టీపీసీసీ స్పందించింది. నిరుద్యోగ నిరసన సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.