జగిత్యాల మహిళ కడుపులో క్లాత్: విచారిస్తున్న త్రీమెన్ కమిటీ

By narsimha lodeFirst Published Apr 19, 2023, 3:37 PM IST
Highlights


జగిత్యాల  ప్రభుత్వాసుపత్రిలో  మహిళ  కడుపులో క్లాత్ ను  వదిలేసిన  ఘటనపై  ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ నిర్వహిస్తుంది. 

కరీంనగర్: జగిత్యాల  ప్రభుత్వాసుపత్రిలో  మహిళ కడుపులో  క్లాత్  మర్చిపోయిన  ఘటనపై   జిల్లా కలెక్టర్ నియమించిన  త్రీమెన్ కమిటీ  బుధవారంనాడు  విచారణ నిర్వహించింది.  ఇవాళే  త్నీమెన్ కమిటీ  జిల్లా కలెక్టర్  యాస్మిన్ భాషాకు  నివేదికను అందించనుంది. 

16 మాసాల క్రితం  జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో   నవ్యశ్రీ అనే  మహిళ  డెలీవరీ కోసం  చేరింది.  సిజేరియన్ ఆపరేషన్ చేసిన  సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా  క్లాత్ ను ఆమె కడుపులోనే వదిలేశారు.  అయితే  సిజేరియన్ ఆపరేషన్ తర్వాత  నవ్యశ్రీ  తరచుగా  కడుపునొప్పికి గురైంది.  దీంతో  ఆమె  ప్రైవేట్  ఆసుపత్రి వైద్యులను  సంప్రదించింది.   స్కానింగ్  చేసి  నవ్యశ్రీ  కడుపులో  క్లాత్  ఉన్నట్టుగా  వైద్యులు  గుర్తించారు.  

also read:జగిత్యాల ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్వాకం: మహిళ కడుపులోనే క్లాత్ వదిలేసిన వైద్యులు (వీడియో)

శస్త్రచికిత్స  నిర్వహించి  నవ్యశ్రీ కడుపు నుండి  ఈ క్లాత్ ను  ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు బయటకు తీశారు.  ఈ విషయమై జగిత్యాల  జిల్లా కలెక్టర్  విచారణకు  ఆదేశించారు. త్రీమెన్ కమిటీ  నవ్యశ్రీకి  శస్త్రచికిత్స  నిర్వహించి  క్లాత్ ను  బయటకు తీసిన  డాక్టర్ ను త్రీమెన్ కమిటీ విచారించింది. నవ్యశ్రీ కి  16 మాసాల క్రితం  సిజేరియన్  నిర్వహించిన డాక్టర్  ఎవరనే విషయమై   కూడా త్రీమెన్ కమిటీ ఆరా తీస్తుంది.  నవ్యశ్రీని కూడా త్రీమెన్ కమిటీ విచారించాలని భావిస్తుంది.  ఈ ఘటనను  కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు.  ఈ విషయమై విచారణ చేసి నివేదిక  ఇవ్వాలని ఆదేశించారు.    ఈ నివేదిక  ఆధారంగా  బాధ్యులపై  చర్యలు తీసుకోనున్నారు  కలెక్టర్.

click me!