కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలిసిన చిలుకూరు ఆలయంలో అద్భుత ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్: కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలిసిన చిలుకూరు ఆలయంలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని సుందరేశ్వర స్వామి ఆలయంలోకి తాబేలు ప్రవేశించింది. తెల్లవారుజామున ఆలయద్వారాలు తెలిసేసరికి శివలింగం పక్కన తాబేలు(కూర్మం) దర్శనమిచ్చింది. ఇలా జరగడం శుభసూచకమని... కోవిడ్19 ని అంతం చేయడానికి ఇది సూచిక అని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ వెల్లడించారు.
ఆదివారం ఉదయం ఆలయద్వారాలు తెరిచిన అర్చకులకు శివలింగం పక్కనే తాబేలు దర్శనమిచ్చింది. వేసిన తలుపులు వేసినట్లే వున్నా ఆలయంలో తాబేలు ప్రత్యక్షమవడం అద్బుతమని అంటున్నారు అర్చకులు. లింగరూపుడయిన శివయ్యతో పాటు కుర్మానికీ పూజలు నిర్వహించారు అర్చకులు.
వీడియో
అనంతరం ప్రధాన అర్చకులు రంగరాజన్ మాట్లాడుతూ... ఇది చాలా అద్భుత సంఘటనగా అభివర్ణించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తుందని... దీని బారి బయటపడబోతున్నామన్న మంచి సంకేతం ఈ ఘటన సూచినట్లుగా వుందన్నారు. స్వామివారి ఆశిస్సులతో త్వరలోనే కరోనాను జయిస్తామన్నారు. వైరస్ ను అంతంచేసే అమృతం లభిస్తుందని రంజగరాజన్ వెల్లడించారు.