చదివింది పది.. డాక్టర్ అని చెప్పుకుంటూ..

By telugu news teamFirst Published Jul 20, 2020, 9:44 AM IST
Highlights

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫేక్ సర్టిఫికెట్‌తో డాక్టర్‌గా అవతారం ఎత్తిన ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన పది వరకే చదివి ఫేక్‌ సర్టిఫికెట్లతో ఇలా డాక్టర్‌ అయ్యాడని తెలుసుకున్న పోలీసులు, జనాలు విస్తుపోయారు. 

అతను చదివింది కేవలం పదో తరగతే. కానీ.. తానొక డాక్టర్ నంటూ అందరినీ నమ్మించాడు. సూటు, బూటు వేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా డాక్టర్ లా చలామణి అవుతూ వస్తున్నాడు. కాగా.. ఈ దొంగ డాక్టర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్‌ పనిచేస్తున్నాడని పక్కా సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు.అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫేక్ సర్టిఫికెట్‌తో డాక్టర్‌గా అవతారం ఎత్తిన ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన పది వరకే చదివి ఫేక్‌ సర్టిఫికెట్లతో ఇలా డాక్టర్‌ అయ్యాడని తెలుసుకున్న పోలీసులు, జనాలు విస్తుపోయారు. 

ఆ నకిలీ డాక్టర్‌తో పాటు ఆస్పత్రి యజమాని షోహెబ్‌ను కూడా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన యజమాని, ఫేక్ డాక్టర్ వద్ద నకిలీ సర్టిఫికేట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అసలు వీరికి సర్టిఫికేట్స్ ఎవరు ఇచ్చారు..? ఏ యూనివర్శిటి అయినా డబ్బులకు ఇలా సర్టిఫికెట్స్ ఇచ్చిందా..? లేకుంటే టెక్నాలజీ సాయంతో ఇలా మార్చేశారా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
 

click me!