ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుటుంబంలో మరోసారి కరోనా కలకలం... కొడుకు, కోడలికి పాజిటివ్

By Arun Kumar P  |  First Published Jul 20, 2020, 10:25 AM IST

హైదరాబాద్ హబ్సిగూడలో నివాసముంటున్న ముత్తిరెడ్డి తనయుడు , కోడలికి కరోనా సోకింది.


హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. ఇటీవలే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన భార్య కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే మరోసారి ఆయన కుటుంబసభ్యులు కరోనా బారినపడ్డారు. 

హైదరాబాద్ హబ్సిగూడలో నివాసముంటున్న ముత్తిరెడ్డి తనయుడు , కోడలికి కరోనా సోకింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించగా    పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో వారికి చికిత్స అందిస్తున్నారు.    

Latest Videos

read more   మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: భార్యాకుమారులకు సైతం..

గత నెలలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో పాటు ఆయన భార్య, ఇంట్లో పనిమనిషి, డ్రైవర్, గన్ మెన్ లు కరోనా బారిన పడ్డారు. దీంతో హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న ఆయనతో పాటు మిగతావారంతా కోలుకున్నారు. అయితే తాజాగా మరో ఇద్దరు కుటుంబసభ్యులు కరోనా బారిన పడటంతో ఆ కుటుంబంలో కలకలం రేగింది.  ఇలా  ముత్తిరెడ్డి కుటుంబంలో ఒకరితర్వాత ఒకరు కరోనాబారిన పడుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. 

ఇక మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఆదివారం రాష్ట్రంలో 1,296 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 45,076కి చేరింది. ఒక్కరోజే రాష్ట్రంలో కోవిడ్‌తో ఆరుగురు మరణించారు.

వీరితో తెలంగాణలో మృతుల కేసుల సంఖ్య 415కి చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటి వరకు 32,438 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 557 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. రంగారెడ్డి 111, వరంగల్ అర్బన్‌లో 117‌ మందికి పాజిటివ్‌గా తేలింది.
 

click me!