Top Stories : తమిళనాడు, ఏపీ, తెలంగాణల్లో మిచాంగ్ హల్చల్.. కొత్త సీఎం ఎంపిక అధిష్టానానిదే.. మిజోరాంలో అధికారపార

By SumaBala Bukka  |  First Published Dec 5, 2023, 8:12 AM IST

తెలంగాణలో ముఖ్యమంత్రి ఎంపిక ఇంకా తేలలేదు. మంగళవారానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో  మిచాంగ్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది.. ఇలాంటి వార్తా కథనాల సమాహారం.. టాప్ టెన్ స్టోరీస్ ఇవి... 


తుది తీర్పు హై కమాండ్ చేతిలో…

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో  సోమవారం నాడు ఏమి తేలలేదు. సీఎల్పీ సమావేశం జరిగి ఎక్కువమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపారు.. కానీ, అధిష్టానం నుంచి రాత్రి వరకు కూడా ఇలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఏకవాక్య తీర్మానంతో అధిష్టానం అని చెప్పిన తర్వాత కూడా.. కొంతమంది సీనియర్లు తమ పేర్లను కూడా సీఎం అభ్యర్థిత్వానికి పరిశీలించాలని కోరారు. కొంతమంది ఎమ్మెల్యేల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో విషయం అధిష్టానం చేతిలోకి వెళ్ళింది. సాయంత్రం వరకు తేలిపోతుందనుకున్న విషయం అక్కడి నుంచి అధికారికంగా అనుమతి రాకపోవడంతో.. ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. దీనికి సంబంధించిన పూర్తి వార్తా కథనాన్ని ఈనాడు ‘ఖరారు బాధ్యత హై కమాండ్ దే’  అనే పేరుతో బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.

Latest Videos

undefined

సీఎం ఎంపిక ఇవ్వాళ లేనట్టే?.. భిన్నాభిప్రాయాలా? డిసెంబర్ 9 దాకా వెయిటింగా?

తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్..

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న మిచాంగ్ తుపానుకు సంబంధించిన వార్తా కథనాన్ని.. ‘ముంచుకొస్తున్న మిగ్ జాం’ పేరుతో బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది ఈనాడు. ఆంధ్రప్రదేశ్,  తమిళనాడులతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో.. మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  బంగాళాఖాతంలో ఏర్పడి.. దీని ప్రభావం ఉత్తర తెలంగాణపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది.  ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని. దీనికి  తోడు  30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని..  సోమవారం నాడు ములుగు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని  రెడ్  అలర్ట్ జారీ చేసింది.

డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు..

 తెలంగాణ వ్యాప్తంగా  సింగరేణి సంస్థ ఆరు జిల్లాల్లో వ్యాపించి ఉంది.  దీనికి సంబంధించిన ఎన్నికలు డిసెంబర్ 27వ తేదీన జరగనున్నాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ఈ మేరకు రంగం సిద్ధమయ్యింది. దీనికి సంబంధించి సోమవారం నాడు డిప్యూటీ చీఫ్ కమిషనర్ ఆఫ్ లేబర్ డి శ్రీనివాసులు.. సింగరేణిలో ఉన్న 13 కార్మిక సంఘాలతో హైదరాబాదులోని కార్మికశాఖ  కార్యాలయంలో భేటీ అయ్యారు. తాజా ఓటర్ల జాబితాను కార్మికులకు ఇచ్చారు. సింగరేణి ఎన్నికల్లో మొత్తం 39,748 మంది  ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ఈనాడు ప్రచురించింది.

కాంగ్రెస్ కు ఆరు నెలల గడువు…

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రెండుసార్లు తమను గెలిపించిన ప్రజలు మూడోసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కనీసం ఆరు నెలల సమయం ఇద్దామని టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తమ పార్టీ నాయకులతో  అన్నారని  సమాచారం. త్వరలోనే శాసనసభాపాక్ష సమావేశం నిర్వహించి నేతను నిర్ణయిస్తామన్నారు. ప్రజా తీర్పును గౌరవించి హుందాగా వైదొలగమని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని..  ఈనాడు ప్రచురించింది.

KCR: కాంగ్రెస్‌కు కేసీఆర్ సవాల్? నాలుగు నెలలు గడ్డుకాలమే!

 ఏపీని వణికిస్తున్న మిచాంగ్

మిచాంగ్ తుఫాన్ సోమవారం తీవ్ర రూపం దాల్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను గంటకు పది కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతోంది. దీంతో తీరం వెంబడి ఉన్న జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఏపీ వైపు దూసుకు వస్తున్న మిచాంగు తుఫాన్ తో ఉమ్మడి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాలో అతలాకుతలం అవుతున్నాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.  నాలుగు జిల్లాల్లో కుండపోత వర్షాలు ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అనేక చోట్ల 15 నుంచి 20 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుంది. బుచ్చినాయుడు కండ్రిగలో అత్యధికంగా 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.  దీనికి సంబంధించిన పూర్తి వార్తా కథనాన్ని…. సాక్షి ‘‘మిచాంగ్’ హోరు’ పేరుతో బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.

Cyclone Michaung: ఏపీలో కుండపోత వర్షం.. నెల్లూరులో నీట‌మునిగిన ప్రాంతాలు, జ‌న‌జీవ‌నం అస్తవ్యస్తం

చెన్నైలో 35 సెంటీమీటర్ల వర్షపాతం..

మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో చెన్నై నీట మునిగింది. దీంతో చెన్నై జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చెన్నైలో ఏకంగా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఎటు చూసినా సముద్రాన్ని తలపిస్తోంది. వర్షాల నేపద్యంలో హైవేలు, సబ్ వేలు మూసివేశారు. విమానాశ్రయం నీట మునిగిపోయింది. మొత్తంగా 160 విమానాలు రద్దయ్యాయి. మంగళవారం నాడు మరింత తీవ్రస్థాయిలో వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.  తమిళనాడును జలప్రళయం చుట్టేసింది. దీనికి సంబంధించిన వార్తను కూడా సాక్షి ‘చెన్నైలో జలప్రళయం’ పేరుతో బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.

చెన్నైలో దంచికొడుతున్న వానలు.. అర్థరాత్రి వరకూ ఇదే పరిస్థితి..

అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్…

యుద్ధ ప్రాతిపదికన  తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని,  కోతకు వచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకోవడం ముఖ్యమని తెలిపారు. ధాన్యంలో తేమ ఎక్కువ ఉంది,  రంగు లేదు అలాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలబడమని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని కూడా సాక్షి మెయిన్ పేజీలో ప్రచురించింది.

ఆ పట్టణాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త... రాగల ఐదుగంటల్లో అత్యంత భారీ వర్షాలు

మిజోరంలోనూ అధికార పక్షానికి ఝలక్ …

మిజోరాం ఎన్నికలకు సంబంధించిన వార్తని మెయిన్ పేజీలో ప్రచురించింది ఆంధ్రజ్యోతి. మిజోరాం ఓట్ల లెక్కింపు సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ప్రతిపక్ష జడ్పీఎమ్ గెలిచింది. అధికార పార్టీ ఎంఎన్ఎఫ్ కు ఓటర్లు జలక్ ఇచ్చారు. కొత్త ముఖ్యమంత్రిగా  లాల్ దుహోమా బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార పార్టీకి కేవలం 10 సీట్లను మాత్రమే కట్టబెట్టారు ఓటర్లు. 

మిజోరంలో జెడ్‌పీఎం ఘన విజయం.. సీఎం జోరంతంగా ఓటమి

గెలిచిన వారిలో.. ఏ సామాజిక వర్గం.. ఎంత శాతం…

తెలంగాణలో ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేలకు సంబంధించి ఓ ఆసక్తికర కథనాన్ని ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో ప్రచురించింది. ఈసారి ఎన్నికైన ఎమ్మెల్యేలలో మొత్తం 43 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు, 13 మంది వెలమ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారని చెప్పుకొచ్చింది.  మొత్తం 119 మందిలో నలుగురు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు.. బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారని తెలిపింది. ఓసీలు 52 శాతం ఉండగా బీసీలు 19 మంది ఉన్నారని తెలిపింది. వీరిలో ఎస్సీ ఎస్టీలు 31 మంది మైనారిటీలు ఏడుగురు ఉన్నట్లుగా లెక్కలు తేల్చింది.  బీసీ ఎమ్మెల్యేలు కేవలం 19 మంది మాత్రమే గెలుపొందారని  తెలిపింది. 

పార్టీ మారుతున్న  ఎంపీలు…

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెళ్లడైన తరువాత జంపింగ్ జపాన్ లు నెమ్మదిగా బయటకు వస్తున్నారు. టిఆర్ఎస్ కు నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు రాజీనామా చేయనున్నారా? టిఆర్ఎస్ నుంచి  కాంగ్రెస్లో చేరనున్నారని  విశ్వసనీయవర్గాల సమాచారం. ఆయన పార్టీని వినడానికి దాదాపుగా నిర్ణయించుకున్నట్లుగా విశ్వసనీయవర్గాల సమాచారం. వారంలోగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం చూసుకొని రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మంతనాలు పూర్తయ్యాయి.  అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాటలను నమ్మి తన కొడుకుకి జడ్పీ చైర్పర్సన్ దక్కకుండా చేశారని రాములు బీఆర్ఎస్ అధిష్టానం మీద అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్ధాకథనాన్ని ‘బీఆర్ఎస్ కు ఎంపీ రాములు గుడ్ బై’ పేరుతో ప్రచురించింది. 

click me!