Telangana CM: సీఎం అభ్యర్థిపై సస్పెన్స్.. అధిష్టానం మద్దతు రేవంత్ కేనా? 

By Rajesh Karampoori  |  First Published Dec 5, 2023, 5:27 AM IST

Telangana CM: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినా..సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ నెలకొన్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఈ విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇప్పటికే రాజభవన్ లోనూ జీఏడీ అధికారులు, ప్రొటోకాల్ ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు సీఎం కాన్వాయిని సైతం సిద్ధం చేశారు. కానీ సీఎం ఎవరనేది దానిపై క్లారిటీ రాలేదు. 


తెలంగాణలో కాంగ్రెస్‌ మార్క్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీకి  పుల్ మెజార్టీ వచ్చినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోజాప్యం చేస్తోంది. , మరి ముఖ్యంగా సీఎం అభ్యర్థిని ఎన్నుకోవడంలో నానా యాతలు పడుతోంది. సీఎం ఎం‍పిక కోసం నిన్న (సోమవారం) హైదరాబాద్‌లో జరిగిన ప్రయత్నాలేవీ  ఫలించలేవు. ఫలితాలు వెలువడి మూడు రోజులు అవుతున్న సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. దీంతో ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించే బాధ్యత హస్తినాకు చేరింది. ఏఐసీసీ ముఖ్య పరిశీలకునిగా వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఢిల్లీకి వెళ్లడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఎమ్మెల్యేల మీటింగ్ ను బైకట్ చేసిన సీనియర్ నేతలు భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహలు ఢిల్లీకి పయనం కావడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 


కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఇతర ఏఐసీసీ పరిశీలకులతో ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేతో భేటీలో చర్చించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో  జరుగునున్న ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయాన్ని వెల్లడిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు క్యూ కట్టనుండడంతో ఈ విషయం ఒక్కరోజులో ఫైనల్ అవుతుందా అనే సందేహా  కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు, ఇవాళ సమావేశమైన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌ లోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా బస చేస్తున్నారు. సీఎం అభ్యర్థి ఖరారు అయ్యే వరకు వారంతా అక్కడే ఉండనున్నారు.

Latest Videos

undefined

పట్టు వీడని అగ్రనేతలు

తాము కూడా సీఎం రేసులో ఉన్నమంటూ అగ్రనేతలు పోటీకి వస్తున్నారు. తాము కూడా అసలు తగ్గేదేలే అంటూ పట్టు వీడడం లేదు. తామూ సీఎం పదవికి అర్హులమేనని పార్టీ అధిష్టానానికి విన్నవించుకుంటున్నారు. ఈ మేరకు ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. వారి అభ్యర్థనను కూడా ద్రుష్టిలో పెట్టుకుని త్వరలో ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుంది అనుకుని ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాటు కూడా చేశారు.. అయితే, సీఎం అభ్యర్థి ఎవరో తెలియకపోవడంతో రాజ్‌భవన్‌ నుంచి పోలీసులు వెళ్లిపోయారు.

రేవంత్ పేరే ఖరారు?

ఇదిలా ఉంటే.. ఢిల్లీకి వెళ్లిన డీకే శివకుమార్ నేడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ కానున్నారు. రాష్ట్ర ఇంచార్జులుగా ఉన్నా ఏఐసీసీ అబ్జర్వ ర్లంతా సీఎం అభ్యర్థిత్వంపై సమీక్ష నిర్వహించను న్నారు. ఫైనల్ గా  సోనియా గాంధీ అనుమతితో సీఎం ఎవరనేది ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనున్నది.  ఇక సీఎంతో పాటు మరో నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే చాన్స్ ఉన్నది. ఇదిలా ఉండగా.. ఇక రేవంత్ రెడ్డినే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. డిసెంబరు 5, 6వ తేదీల్లో మంచి ముహుర్తం లేనందున 7న ప్రమాణ స్వీకారం చేసే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఏదిఏమైనా.. ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు .. సీఎం అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ ఉంటుంది. 

click me!