‘‘టీ అమ్మనీకి పోయినా’’.. నేను ఉండుంటే దిశపై దారుణం జరిగేది కాదు

By Siva Kodati  |  First Published Dec 20, 2019, 4:18 PM IST

దిశపై అత్యాచార ఘటకు సాక్ష్యంగా నిలిచిన తొండుపల్లి ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని ఖాళీ ప్రదేశం వద్ద ఉన్న గదిలో ఓ టీ అమ్మే వ్యక్తి నివసించేవాడట


హైదరాబాద్ శంషాబాద్‌లో పశువైద్యురాలు దిశపై జరిగిన దారుణ హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే దిశపై అత్యాచార ఘటకు సాక్ష్యంగా నిలిచిన తొండుపల్లి ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని ఖాళీ ప్రదేశం వద్ద ఉన్న గదిలో ఓ టీ అమ్మే వ్యక్తి నివసించేవాడట.

ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు టీ అమ్మేందుకు వెళుతూ.. గదికి తాళం వేశాడట. ఒకవేళ ఆయన గనుక ఆ రోజు అక్కడ ఉండుంటే దిశపై అంతటి ఘోరం జరిగేది కాదని ఆ టీ అమ్మే వ్యక్తి తెలిపాడు.

Latest Videos

Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాల అప్పగింతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆ దారుణ ఘటన తర్వాత పోలీసులు తొండుపల్లి వద్ద రోడ్డు పక్కన లారీలను ఆపకుండా ఆంక్షలు విధించారు. మరో వైపు టోల్‌రోడ్డు వైపు ఒంటరిగా మహిళలు ప్రయాణించడానికి భయపడుతున్నారు.

కాగా దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై విచారణను శనివారానికి వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకొంది. మృతదేహాల అప్పగింతపై సుప్రీంకోర్టు తమను నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు తేల్చి చెప్పింది.

ఈ నెల 6వ తేదీన చటాన్‌పల్లి సమీపంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Also Read:బిగ్ బ్రేకింగ్: దిశ నిందితుల కేసులో బయటకొస్తున్న సంచలన విషయాలు

అదే రోజున నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు జరపాలని భావించారు. కానీ, ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో మృతదేహాలను భద్రపర్చాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో నిందితుల మృతదేహాలు భద్రపర్చారు.

click me!