శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైద్రాబాద్ కు చేరుకొన్నారు. ఈ నెల 28వ తేదీ వరకు కోవింద్ హైద్రాబాద్‌లో ఉంటారు.
హైదరాబాద్: హైద్రాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారంనాడు చేరుకొన్నారు.రాష్ట్రపతి కోవింద్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు పలువురు మంత్రులు స్వాగతం పలికారు.
ప్రతి ఏటా శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైద్రాబాద్‌కు వస్తారు. ఇందులో భాగంగానే శుక్రవారం నాడు రాష్ట్రపతి కోవింద్ శుక్రవారం నాడు కుటుంబ సమేతంగా హైద్రాబాద్‌కు వచ్చారు.
undefined
హైద్రాబాద్ హాకీంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రపతి కోవింద్ హైద్రాబాద్‌లోనే ఉంటారు.
ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రపతి కోవింద్ హైద్రాబాద్‌లోనే ఉంటారు.ఈ నెల 22వ తేదీన తెలంగాణ రెడ్‌క్రాస్ సోసైటీ మొబైల్ యాప్ ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. రాజ్‌భవన్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ నెల 23వ తేదీన పాండిచ్ఛేరీలో రాష్ట్రపతి కోవింద్ పర్యటించనున్నారు.పాండిచ్ఛేరీ యూనివర్శిటీ వార్షికోత్సవ స్నాతకోత్సవంలో కోవింద్ పాల్గొంటారు. ఈ నెల 24వ తేదీన వివేకానంద రాక్ మెమోరియల్, కన్యాకుమారిలో వివేకానంద కేంద్రాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు.
ఈ నెల 27వ తేదీన బొల్లారంలోని రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. ఈ విందులో సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీన ఉదయం రాష్ట్రపతి కోవింద్ హైద్రాబాద్ నుండి బయలుదేరనున్నారు.