Today Top Stories: ధరణి ప్రక్షాళనకు రేవంత్ సర్కార్ రెడీ.. మేడిగడ్డ బ్యారేజీపై జ్యుడిషీయల్ విచారణ.. భారత్ ఓటమి

By Rajesh KarampooriFirst Published Jan 10, 2024, 6:10 AM IST
Highlights

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో ధరణి ఉంటదా.. ఉండదా ..ప్రక్షాళనకు రేవంత్ సర్కార్ రెడీ, మేడిగడ్డ బ్యారేజీపై జ్యుడిషీయల్ విచారణ, దావోస్‌కు సీఎం రేవంత్ టీం , మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి హైకోర్టులో ఊరట,  సీఈసీ బృందంతో పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ, జగన్‌ కీలక నిర్ణయం ..భారత్-మాల్దీవుల వివాదంపై మల్లికార్జున్ ఖర్గే, రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు..భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం..వంటి పలు వార్తల సమాహారం

Today Top Stories: ధరణి ప్రక్షాళనకు రేవంత్ సర్కార్ సిద్దం  

Dharani Portal : ధరణి  పోర్టల్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై అధ్యయనం , పునర్నిర్మాణం కోసం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. సీసీఎల్ఏ కన్వీనర్‌గా ఏర్పాటైన కమిటీలో ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది ఎం సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్ వున్నారు. పరిస్ధితులు, అవసరాన్ని బట్టి కలెక్టర్లు, ఇతర రెవెన్యూ అధికారులను సభ్యులుగా చేర్చుకోవచ్చని ప్రభుత్వం జీవోలో తెలిపింది. సాధ్యమైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. 

Latest Videos

మేడిగడ్డ బ్యారేజీపై జ్యుడిషీయల్ విచారణ  

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై  జ్యుడీషీయల్ విచారణకు  సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు  రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జ్యుడీషీయల్ విచారణ నిర్వహిస్తామని  తెలంగాణ శాసనమండలిలో  ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు  ఇవాళ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు  రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయమై  రాష్ట్ర వ్యాప్తంగా  ఇవాళ  12 చోట్ల విజిలెన్స్ అధికారులు ఏక కాలంలో  సోదాలు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ కార్యాలయంలో ఇటీవల  కీలకమైన కంప్యూటర్లు, ఫైల్స్ మాయం కావడంపై  రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగిన  ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు  సోదాలు నిర్వహిస్తున్నారు. 

దావోస్‌కు సీఎం రేవంత్ టీం 

CM Revanth Davos Tour: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ నగరంలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సు-2024లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడిన ఎనిమిది మంది సభ్యుల బృందం వెళ్లనుంది. నాలుగు రోజుల పాటు జరిగే చర్చల్లో తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంపై అంతర్జాతీయ వ్యాపార సంస్థల ప్రతినిధులతో మాట్లాడనున్నారు. గత ఏడాది జనవరి మూడో వారంలో చివరి డబ్ల్యూఈఎఫ్‌ పర్యటన జరగ్గా, అప్పటి ఐటీ మంత్రి కెటి రామారావు నేతృత్వంలోని బృందం హాజరైంది. ఆ సమయంలో..కేటీఆర్ సుమారు రూ. 21000 కోట్ల పెట్టుబడులను పొందినట్లు సమాచారం.

 మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి హైకోర్టులో ఊరట..

 Ex Mla Shakeel: బీఆర్ఎస్ (Brs) మాజీ ఎమ్మెల్యే షకీల్ (Ex Mla Shakeel) కుమారుడు సాహిల్ కు ఊరట లభించింది. ప్రగతి భవన్ రోడ్డు ప్రమాదం కేసులో సాహిల్ ను అరెస్టు చేయవద్దని, ఈ మేరకు పంజాగుట్ట పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17న పంజాగుట్ట పోలీసుల ముందు లొంగిపోవాలని సూచించింది.అలాగే.. కారు ప్రమాద ఘటనకు సంబంధించి కేసు డైరీని సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో సాహిల్ పేరును తొలగించాలని, అతని తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. 

సీఈసీ బృందంతో పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ.. 

ఆంధ్ర ప్రదేశ్ లో మంగళవారం నుంచి మూడు రోజులపాటు కేంద్ర ఎన్నికల సంఘం రెండో విడత పర్యటన చేయనుంది. దీనికోసం  సోమవారం సాయంత్రమే సీఈసీ బృందం విజయవాడకు చేరుకుంది. ఈ బృందంలో సీఈసీ రాజీవ్ కుమార్ తో పాటు, కమీషనర్లు అనూప్, అరుణ్ గోయల్ లతో సహా తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. విజయవాడకు వచ్చిన వీరికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, బెజవాడ సీపీ స్వాగతం పలికారు. ఆ తర్వాత సోమవారం రాత్రే సీఈసీ రాజీవ్ కుమార్ సీఈఓ ఎంకె మీనాతో సమావేశమయ్యారు. మంగళవారం నాడు జరిగే సమావేశం అజెండా అంశాల మీద సమీక్ష చేశారు.

జగన్‌ కీలక నిర్ణయం .. రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు..

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ మేరకు ముగ్గురు నేతలకు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర వేశారు. గతంలో ఏపీ నుంచి రాజ్యసభకు వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపికయ్యారు. త్వరలో వీరి ముగ్గురి పదవీ కాలం ముగియనుండటంతో మూడు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలం నేపథ్యంలో మూడు స్థానాలు వైసీపీ దక్కించుకునే అవకాశం వుంది. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు (ఎస్సీ), జంగాలపల్లి శ్రీనివాస్ (బలిజ)లను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు స్థానాల అభ్యర్ధుల ఎంపికతో రాజ్యసభలో వైసీపీ బలం 11కు చేరనుంది.  

  భారత్-మాల్దీవుల వివాదంపై మల్లికార్జున్ ఖర్గే


India -  Maldives row : మాల్దీవులు - భారత్ కు మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం స్పందించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి విషయాన్ని పర్సనల్ గా తీసుకుంటున్నారని అన్నారు. మన దేశానికి సరిహద్దులో ఉన్న వారిని మనం మార్చలేమని అన్నారు.  వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో ఖర్గే మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ప్రతీ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు. కాలానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు. మన పొరుగువారిని మనం ఎప్పటికీ మార్చలేమని చెప్పారు.

 భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం..
 

IND W vs AUS W: భారత్ లో జరిగిన మూడో టీ 20 సిరీస్ లో ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ రోజు  ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. మూడు మ్యాచ్ ల T20 సిరీస్‌ను ఆసీస్ తన వశం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

click me!