Today Top 10 News: మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి.. జనసేనాని- చంద్రబాబు భేటీ..బిగ్ బాస్ 7 విన్నర్ రైతుబిడ్డ

By Rajesh Karampoori  |  First Published Dec 18, 2023, 5:36 AM IST

Today Top 10 News 18 December 2023: మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. త్వరలో రేవంత్ మంత్రివర్గ విస్తరణ..శరవేగంగా మారుతున్న ఏపీ రాజకీయాలు..హైదరాబాద్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ, తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు. తొలి వన్డే భారత్ ఘన విజయం.. బిగ్ బాస్ 7 విజేత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వంటి వార్తల సమాహారంతో  asianetnews telugu.టాప్ 10 న్యూస్‌ మీ కోసం.. 


Today Top 10 Telugu News 18 December 2023: 

అన్ని లెక్కలూ ఇవ్వండి.. మేడిగడ్డ బ్యారేజీపై శ్వేత పత్రం విడుదలకు కసరత్తు.. 

Latest Videos

మేడిగడ్డ బ్యారేజీ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన ఇతర ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులతో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్‌ కుంగుబాటు, నిర్మాణ అంశాలు, డిజైన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ సర్కార్ అవలంబించిన విధానాలు, ఆర్థిక వ్యవహారాలపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి.. శ్వేతపత్రం విడుదల చేయాలనే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్న విషయం తెలిసిందే. 

మంత్రి ఉత్తమ్ కు హరీష్ రావు బహిరంగ లేఖ
 
సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని అందుకు అవసరమగు నీటిని మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్‌కి నీటిని పంపు చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) కోరారు. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి(Uttam Kumar Reddy) హరీష్ రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లా రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్య విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో సాగు భూములకు రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందజేశామన్నారు. దీంతో పంట దిగుబడి పెరిగి రైతుల బతుకుల్లో సంతోషం నిండిందన్నారు. 

త్వరలో రేవంత్ మంత్రివర్గ విస్తరణ  

రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ హైకమాండ్ అనుమతితోనే ముఖ్య నిర్ణయాల అమలు జరుగుతోంది. ఈ క్రమంలో భాగంగా మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరలో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పార్టీ పరంగా నియామకాలకు సంబంధించిన చర్చలు, ఆమోద ముద్ర వేసుకరానున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో మంత్రి విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. అలాగే.. నామినేటెడ్‌ పదవుల భర్తీపైన హైకమాండ్‌తో చర్చించనున్నారని సమాచారం.  లోక్‌సభ ఎన్నికలు ద్రుష్టిలో పెట్టుకుని పదవుల పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.అదే సమయంలో లోక్‌సభ అభ్యర్థుల విషయంలోనూ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణ చలితో వణుకుతోంది. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలు గజగజలాడుతున్నాయి.  కొద్ది రోజుల రోజుల వరకు 15 డిగ్రీల సెల్సియస్ గా ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా 10 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పొగమంచు కమ్ముకుంటోంది.  ఉదయం చలితోడు, తెల్లవారు జామున మంచు కూడా కురుస్తుండటంతో ప్రజలు అవస్థలపాలవుతున్నారు. రానురాను చలి తీవ్రత మరింత పెరిగిందని అంటున్నారు.
 

తొలి వన్డే భారత్ ఘన విజయం

SA vs IND: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (IND vs SA)మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించింది. భారత బౌలర్ల దాటికి మ్యాచ్‌ వన్‌సైడ్ వార్ గా మారిపోయింది.  భారత ఫాస్ట్ బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ వరుసగా ఫెవియన్ బాటపట్టారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్ లో ఐడెన్ మార్క్‌రామ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. తర్వాత దక్షిణాఫ్రికాను 27.3 ఓవర్లలో కేవలం 116 పరుగులకే ఆలౌట్ చేశారు భారత బౌలర్లు. స్వంత గడ్డపై దక్షిణాఫ్రికాను అత్యల్ప పరుగులకే అవుట్ చూసి మ్యాచ్ ను వన్ సైడ్ వార్ లాగా మార్చారు. 

 

ఎన్నికల వ్యూహంపై చంద్రబాబు, పవన్ భేటీ.. 

టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాదులోని జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది.  ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన అజెండాగా పవన్ కళ్యాణ్,చంద్రబాబు నాయుడు మధ్య ఆదివారం రాత్రి ప్రత్యేక భేటీ జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే దిశగా చర్చలు సాగాయి. వైసీపీ విముక్త ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలో చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌..

Bigg Boss Telugu 7 Winner: బిగ్‌ బాస్‌ తెలుగు 7 గ్రాండ్‌ ఫినాలే సెర్మనీ గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్‌ విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ నిలిచాడు. ప్రశాంత్‌కి ట్రోఫీ అందించారు నాగార్జున. కామన్‌ మ్యాన్‌ నుంచి బిగ్‌ బాస్‌ విన్నర్‌గా నిలిచిన ప్రశాంత్‌ చరిత్ర సృష్టించాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఏకకాలంలో నాలుగు లక్ష్యాలను చేధించే ‘ఆకాశ్’
 
రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన విజయాన్ని సాధించింది. గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించిన స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ ముందడుగువేసింది. ఆకాశ్ క్షిపణి బలం గురించి డీఆర్‌డీవో ఆదివారం సమాచారం ఇచ్చింది. ఆకాష్ క్షిపణి వ్యవస్థ ప్రదర్శనలో ఏకకాలంలో నాలుగు లక్ష్యాలను ధ్వంసం చేయగల శక్తి ఆకాష్‌కు ఉందని DRDO చూపించింది. 25 కిలోమీటర్ల వరకు ఛేదించగల సామర్థ్యం ఉన్న ఆకాష్ క్షిపణికి ఉందని తెలిపింది.ఒకే ఫైరింగ్‌‌తో రెండు లాంచర్ల నుంచి ఏకకాలంలో చెరో రెండు మిస్సైళ్లు రిలీజ్ చేసి.. కచ్చితమైన గగనతల లక్ష్యాలను చేధించే సామర్థం ఆకాష్ క్షిపణి వ్యవస్థకు ఉందనీ, దీనిని అత్యాధునిక ఆయుధంగా పరిగణించనున్నట్లు DRDO తెలిపింది.  

click me!