మంత్రి ఉత్తమ్ కు హరీష్ రావు బహిరంగ లేఖ

By Rajesh Karampoori  |  First Published Dec 18, 2023, 12:51 AM IST

సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందిచాలని, అందుకు అవసరమగు నీటిని మిడ్ మానెర్ నుండి రంగనాయక సాగర్ కి నీటిని పంప్ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.  


సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని అందుకు అవసరమగు నీటిని మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్‌కి నీటిని పంపు చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) కోరారు. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి(Uttam Kumar Reddy) హరీష్ రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లా రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్య విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో సాగు భూములకు రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందజేశామన్నారు. దీంతో పంట దిగుబడి పెరిగి రైతుల బతుకుల్లో సంతోషం నిండిందన్నారు. 

అయితే.. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్‌లో లేక రైతాంగం ఆందోళనకు గురవుతున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.  యాసంగికి నీళ్లు అందించాలంటే 3 టీఎంసీల నీరు ఉండాలని, కానీ, ప్రస్తుతం రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో నీరు తక్కువగా ఉందన్నారు. రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వెంటనే మిడ్ మానేరు నుంచి 1.50 టీఎంసీల నీళ్లు రంగనాయక సాగర్‌కు వచ్చే విధంగా పంపింగ్ చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని కోరారు.
ఆయన ఈ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Latest Videos

click me!