తెలంగాణ కరోనా అప్ డేట్: 3లక్షల కేసులు, కోటికి చేరిన టెస్టులు

Arun Kumar P   | Asianet News
Published : Mar 28, 2021, 11:52 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: 3లక్షల కేసులు, కోటికి చేరిన టెస్టులు

సారాంశం

శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 57,942మందికి కరోనా టెస్టులు చేయగా 535మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో(శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 57,942మందికి కరోనా టెస్టులు చేయగా 535మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,06,339కు చేరితే టెస్టుల సంఖ్య 1,00,19,096కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 278మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,00,156కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,495 యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 1,979గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1688కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55శాతంగా వుంటే దేశంలో ఇది 1.3శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 94.6శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.98శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 7, నాగర్ కర్నూల్ 7, జోగులాంబ గద్వాల 4,  కామారెడ్డి 8, ఆదిలాబాద్ 11, భూపాలపల్లి 6, జనగామ 5, జగిత్యాల 15, అసిఫాబాద్ 5, మహబూబ్ నగర్ 21, మహబూబాబాద్ 3, మెదక్ 6, నిర్మల్ 11, నిజామాబాద్ 32,  సిరిసిల్ల 7, వికారాబాద్ 6, వరంగల్ రూరల్ 6,  ములుగు 1, పెద్దపల్లి 6, సిద్దిపేట 8, సూర్యాపేట 9, భువనగిరి 19, మంచిర్యాల 9, నల్గొండ 11 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 154కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 49, రంగారెడ్డి 39, కొత్తగూడెం 5, కరీంనగర్ 15, ఖమ్మం 16,  సంగారెడ్డి 22, వరంగల్ అర్బన్ 11కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:    

 

PREV
click me!

Recommended Stories

గుజరాత్ లో పార్టీ పెట్టుకో పవన్ కళ్యాణ్‌ కి మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్| Asianet News Telugu
KTR Fires Back at Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై కేటీఆర్ మాటల తూటాలు | Asianet News Telugu