ఎన్నికలకు ముందు సగం మంది కాంగ్రెస్ నేతలు అమ్ముడుపోయారు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

By narsimha lodeFirst Published Mar 28, 2021, 11:33 AM IST
Highlights

:కొత్త పార్టీ ఏర్పాటు చేయాలా....లేదా ఎవరైనా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే వారితో కలిసి పనిచేయాలా... లేదా ఏ పార్టీలో చేరాలా అనే విషయమై ఇంకా నిర్ణయించుకోలేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.
 

హైదరాబాద్:కొత్త పార్టీ ఏర్పాటు చేయాలా....లేదా ఎవరైనా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే వారితో కలిసి పనిచేయాలా... లేదా ఏ పార్టీలో చేరాలా అనే విషయమై ఇంకా నిర్ణయించుకోలేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.
 
ఆదివారం నాడు చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్‌ను వీడి పది రోజులు అయిందన్నారు.  కేసీఆర్ తనను రాజకీయాల్లో రావాలని మూడేళ్లు వెంటపడితే రాజకీయాల్లోకి వచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు.రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చినట్టుగా ఆయన తెలిపారు.

కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షం కాదన్నారు. తెలంగాణలో బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బలమైన ప్రాంతీయ పార్టీ ఉండాలని తాను కోరుకొంటున్నట్టుగా చెప్పారు. తెలంగాణలో రీజినల్ పార్టీలు ఎక్కువైతే మళ్లీ టీఆర్ఎస్ కే లాభమని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులున్నాయన్నారు. ఎన్నికలకు ముందు సగం మంది కాంగ్రెస్ నేతలు అమ్ముడుపోయారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.అందరితో మాట్లాడి తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకొంటానని ఆయన చెప్పారు. స్థానిక సమస్యలపై తాను దృష్టి పెడతానని చెప్పారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేతలే విలన్లుగా మారారన్నారు.షర్మిల పార్టీలో చేరే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కూడా గొప్ప నాయకుడు అని ఆయన చెప్పారు.తెలంగాణ వ్యతిరేకి షర్మిల పార్టీ అని ఆయన అభిప్రాయపడ్డారు. 
 

click me!