తెంపులేని కుండపోత వర్షం: హైదరాబాద్ లో నేడు స్కూల్స్ కు సెలవు..

Published : Sep 05, 2023, 08:34 AM ISTUpdated : Sep 05, 2023, 09:16 AM IST
తెంపులేని కుండపోత వర్షం: హైదరాబాద్ లో నేడు స్కూల్స్ కు సెలవు..

సారాంశం

భారీ వర్షం కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నేడు స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. 

హైదరాబాద్  : భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ జిల్లాలో స్కూల్స్ కి సెలవు ప్రకటించారు. హైదరాబాద్ తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు అధికారులు. గతరెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలదిగ్భంధనంలో మునిగిపోయాయి. 

మంగళవారం తెల్లవారు జాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్ల మీద మోకాలు లోతు నీళ్లు చేరాయి. ఉదయాన్నే స్కూళ్లకు, ఆఫీసులకు బయలుదేరిన వారి వాహనాలతో రోడ్ల మీద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు నేడు స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ