హైదరాబాద్ లో కుండపోత : మరో మూడు గంటలు భారీ వర్షం..జీహెచ్ఎంసీ హెచ్చరికలు..

By SumaBala Bukka  |  First Published Sep 5, 2023, 7:58 AM IST

హైదరాబాద్ లో తెల్లవారుజామునుంచి కురుస్తున్న కుండపోత వాన ఆగలేదు. మరో మూడు గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. 


హైదరాబాద్ : హైదరాబాదులో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో హైదరాబాద్ నగరపాలక సంస్థ జిహెచ్ఎంసి అప్రమత్తమయ్యింది.  మరో మూడు గంటల పాటు హైదరాబాదులో భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసింది.  

- హైదరాబాదులో కుండ పోత వర్షం కురుస్తున్న కారణంగా అవసరమైతే తప్ప బయటికి రావద్దని  జిహెచ్ఎంసి హెచ్చరికలు జారీ చేసింది. 

Latest Videos

- డీఆర్ఎస్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి తెలిపింది. 

దంచి కొడుతున్న వాన.. నేడు కూడా అతిభారీ వర్షాలు...పలు జిల్లాలు ఆరెంజ్ అలర్ట్..

- వర్షం కారణంగా రాజేంద్ర నగర్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తోంది. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేశారు. మరి కాసేపట్లో మరో నాలుగు గేట్లు ఎత్తే అవకాశం.

- కుండపోత వర్షం కారణంగా హైదరాబాదుకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

- హుస్సేన్ సాగర్ లెవెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అధికారులు అందుబాటులో ఉండాలని జిహెచ్ఎంసి ఆదేశాలు జారీ చేసింది. 

- హైదరాబాదులోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.  శేరిలింగంపల్లిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. 

- చందానగర్, మియాపూర్, మదీనాగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

- హైదరాబాదులో 9.78 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తోంది. 

- మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తోంది.జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు పరిసర ప్రాంతాల వాసులను అప్రమత్తం చేశారు. 

- మరికొన్ని గంటల్లో గేట్లు తెరిచే అవకాశం ఉందని సమాచారం.

click me!